ప్రస్తుత రోజుల్లో చాలా మంది యువత ముఖంపై మొటిమల సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ మొటిమల కారణంగా ముఖం అందవిహీనంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖంపై మొటిమలు ఎక్కువగా ఉండటం వల్ల నలుగురిలోకి వెళ్లాలి అన్న కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక అమ్మాయిలు అయితే ముఖంపై మొటిమలను కవర్ చేసుకోవడానికి ఎక్కువ మొత్తంలో మేకప్ ని వేసుకుంటూ ఉంటారు. ఈ కానీ అబ్బాయిలు మాత్రం అంతగా పట్టించుకోరు. కానీ ఈ పింపుల్స్ కొన్ని కొన్ని సార్లు ఎక్కువ అయ్యి లావుగా మరి ముఖంపై గుంతలు కూడా ఏర్పడుతూ ఉంటాయి.
అయితే మరి పింపుల్స్ సమస్య నుంచి బయట పడాలంటే ఏం చేయాలో ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చలికాలంలో వచ్చే మొటిమలను వదిలించుకోవడానికి తులసి ఆకులను గ్రైండ్ చేసి,వేప ఆకుల పేస్ట్, పసుపు పొడి, గంధపు పొడిని కలిపి ప్యాక్ తయారు చేయాలి. ఈ ప్యాక్ ని మీ ముఖమంతా అప్లై చేసి కొన్ని నిమిషాల తర్వాత కడిగేయాలి. అలాగే అర టీస్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ తేనెతో ప్యాక్ తయారు చేయాలి. పసుపు సహజమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఇది మొటిమల చికాకును తగ్గించడానికి, చర్మాన్ని శాంత పరచడానికి సహాయపడుతుంది. అలాగే తేనె చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ను మీ మొఖంపై 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచి తర్వాత కడిగేయాలి.
మరో రెమెడీ విషయానికి వస్తే వెల్లుల్లి రెబ్బలను చూర్ణం చేసి కలబంద ఆయిల్ లో వేయవచ్చు. ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పాలలో వెల్లుల్లి ప్యాక్ ను కలిపి ముఖానికి అప్లై చేసి పది నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మొటిమలతో పోరాడడానికి ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. తులసి ఆకుల పొడిని ఒక చెంచా ఓట్స్ పౌడర్, ఒక చెంచా పచ్చి పాలు కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. దీనిని మొఖానికి అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉంచి కడగాలి. జిడ్డు చర్మాన్ని సంరక్షించడానికి తులసితో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. తులసి, వేప ఆకులను కలిపి రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చర్మానికి బాగా పట్టించాలి. కాసేపు ఆరిన తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా ఉంటుంది. పైన చెప్పిన ఫేస్ ప్యాక్ లు ట్రై చేయడం వల్ల ఈజీగా మొటిమలు సమస్య నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు.