Aloevera: ముఖం అందంగా మెరిసిపోవాలి అంటే కలబందను ఇలా ఉపయోగించాల్సిందే?

కలబంద వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా

Published By: HashtagU Telugu Desk
Mixcollage 03 Feb 2024 11 46 Am 9571

Mixcollage 03 Feb 2024 11 46 Am 9571

కలబంద వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. జుట్టుకు సంబంధించిన సమస్యలకు అలాగే చర్మానికి సంబంధించిన సమస్యలకు కలబంద ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అయితే ముఖం అందంగా కనిపించడం కోసం చాలామంది ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ కానీ అవన్నీ ఏం అవసరం లేదు. కేవలం కలబందతో కొన్ని రకాల పాటిస్తే చాలు మీ ముఖం మెరిసిపోవడం ఖాయం. అలోవెర్ జెల్ అనేది నేచురల్ మాయిశ్చరైజర్. దీంతో ఫేస్‌కి మసాజ్ చేయడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ వస్తాయి. సహజ కాంతి వస్తుంది.

దీని వల్ల ముఖంలో బ్రైట్‌గా మారుతుంది. అందంగా మారుతుంది. కలబందను తరచుగా ఉపయోగించడం వల్ల ఆ చర్మానికి సంబంధించిన అనేక రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలోవెర్‌ జెల్‌లో నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఈ రెండింటి కాంబినేషన్‌ ముఖంపై మ్యాజిక్ చేస్తుంది. ఇలా రాసి 15 నిమిషాల పాటు మసాజ్ చేసి ఆ తర్వాత క్లీన్ చేసుకోవాలి. అలాగే చర్మానికి సంబంధించిన సమస్యలకు తేనె కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. తేనె కూడా మంచి గుణాలను కలిగి ఉంది. ఇందులోని ప్రత్యేక గుణాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. ఇందుకోసం తేనెలో అలోవేరా కలిపి రాసి 15 నిమిషాల పాటు ఉంచి ఆరిన తర్వాత క్లీన్ చేయాలి. దీని వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది.

అదేవిధంగా ముఖానికి మెరుపుని తీసుకురావడంలో గంధం బాగా పనిచేస్తుంది. గంధం పొడిలో అలోవెరా జెల్ కలపి ప్యాక్‌లా చేయాలి. దీనిని ముఖానికి అప్లై చేసి ఆరనివ్వాలి. దాని వల్ల స్కిన్ టైట్ అవుతుంది. ఇందుకోసం ముందుగా ముఖాన్ని చల్లని నీటితో కడిగి దీనిని ప్యాక్‌‌లా చేసి అప్లై చేయవచ్చు. అయితే, మీరు వాడే గంధం నేచురల్‌‌ది మాత్రమే అవ్వాలి. అదేవిధంగా వారానికి ఓసారి ముఖాన్ని స్క్రబ్ చేయడం చాలా ముఖ్యం. అందుకోసం ముందుగా కొద్దిగా బియ్యం పిండి తీసుకోవాలి. అందులో నిమ్మరసం, మిక్స్ చేసి అందులో కలబంద జెల్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ మాస్క్ బాగా ఆరిపోయాక 5 నిమిషాల పాటు మసాజ్ చేసి క్లీన్ చేసుకోవాలి. దీని వల్ల ముఖంపై మృతకణాలు తగ్గి ముఖం మెరుస్తుంది.

  Last Updated: 04 Feb 2024, 06:24 PM IST