Aloevera: కలబంద గుజ్జులో ఇవి కలిపి రాస్తే చాలు మీ ముఖం క్షణాల్లోనే అందంగా మెరిసిపోవాల్సిందే?

మామూలుగా ప్రతి ఒక్కరు కూడా మెరిసిపోయే చర్మం కావాలని కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఆడ, మగ అనే తేడా లేకుండా చాలామంది అందం విషయం

  • Written By:
  • Publish Date - January 29, 2024 / 07:30 PM IST

మామూలుగా ప్రతి ఒక్కరు కూడా మెరిసిపోయే చర్మం కావాలని కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఆడ, మగ అనే తేడా లేకుండా చాలామంది అందం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా మెరిసిపోయే చర్మం మీ సొంతం కావాలని అనుకుంటున్నారా. అయితే అలోవెరా తో ఈ పదార్థాలు కలిపి రాస్తే చాలు క్షణాల్లోనే మీ ముఖం అందంగా మరిచిపోవడం ఖాయం. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికొస్తే.. అలోవెర్ జెల్ అనేది నేచురల్ మాయిశ్చరైజర్. దీంతో ఫేస్‌కి మసాజ్ చేయడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ వస్తాయి. సహజ కాంతి వస్తుంది. దీని వల్ల ముఖంలో బ్రైట్‌గా మారుతుంది.

అందంగా మారుతుంది. అలోవెర్‌ జెల్‌లో నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఈ రెండింటి కాంబినేషన్‌ ముఖంపై రాసి 15 నిమిషాల పాటు మసాజ్ చేసి ఆ తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా చేస్తే చర్మం మిల మిల మెరవడం కాయం.
తేనె కూడా మంచి గుణాలను కలిగి ఉంది. ఇందులోని ప్రత్యేక గుణాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. ఇందుకోసం తేనెలో అలోవేరా కలిపి రాసి 15 నిమిషాల పాటు ఉంచి ఆరిన తర్వాత క్లీన్ చేయాలి. దీని వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. అదే విధంగా, ముఖానికి మెరుపుని తీసుకురావడంలో గంధం బాగా పనిచేస్తుంది. గంధం పొడిలో అలోవెరా జెల్ కలిపి ప్యాక్‌లా చేయాలి. దీనిని ముఖానికి అప్లై చేసి ఆరనివ్వాలి.

దాని వల్ల స్కిన్ టైట్ అవుతుంది. ఇందుకోసం ముందుగా ముఖాన్ని చల్లని నీటితో కడిగి దీనిని ప్యాక్‌‌లా చేసి అప్లై చేయవచ్చు. అయితే, మీరు వాడే గంధం నేచురల్‌‌ది మాత్రమే అవ్వాలి. అదే విధంగా, వారానికి ఓసారి ముఖాన్ని స్క్రబ్ చేయడం చాలా ముఖ్యం. అందుకోసం ముందుగా కొద్దిగా బియ్యం పిండి తీసుకోవాలి. అందులో నిమ్మరసం, మిక్స్ చేసి అందులో అలోవెరా జెల్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. ఈ మాస్క్ బాగా ఆరిపోయాక 5 నిమిషాల పాటు మసాజ్ చేసి క్లీన్ చేసుకోవాలి. దీని వల్ల ముఖంపై మృతకణాలు తగ్గి ముఖం మెరుస్తుంది. కలబంద కేవలం అందానికి మాత్రమే కాకుండా జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది.