‎Winter Foot Care: కాళ్ల పగుళ్లతో తెగ ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి!

‎Winter Foot Care: చలికాలంలో పొడి వాతావరణం కారణంగా కాళ్ల పగుళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటిస్తే త్వరగా ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Cracked Heel

Cracked Heel

‎Winter Foot Care: పాదాల పగుళ్ల సమస్యలు చాలా మందిని తెగ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొన్నిసార్లు పగుళ్లు ఎక్కువగా ఏర్పడి రక్తం కూడా రావచ్చు. ఈ కారణంగా రాత్రుళ్లు నిద్ర పట్టక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ పాదాల పగుళ్ల సమస్యకు చాలామంది అనేక రకాల ఆయింట్మెంట్లు క్రీములు వాడుతూ ఉంటారు. అయినా కూడా ఈ ఇబ్బంది తప్పదు. అయితే మరి ఈ పాదాళ్ల పగుళ్ల సమస్య ఉండకూడదు అంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

‎ చలికాలంలో మడమల సంరక్షణలో మొదటి మెట్టు శుభ్రత అని చెప్పాలి. దీని కోసం ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు వేయాలి. మీ పాదాలను 10 నుంచి 15 నిమిషాల వరకు దానిలో ఉంచాలి. ఇది మడమలపై ఉన్న చనిపోయిన, గట్టి చర్మాన్ని మృదువుగా చేస్తుందట. తరువాత ప్యూమిక్ స్టోన్ లేదా బ్రష్ తో రుద్దాలి. ఈ పద్ధతి పొడిబారడాన్ని తగ్గించి పాదాలకు ఉపశమనం కలిగిస్తుందట. అలాగే కొబ్బరి నూనె ఒక అద్భుతమైన సహజ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడగాలి, ఆరిన తర్వాత మడమల మీద కొబ్బరి నూనెతో 5 నిమిషాలు మసాజ్ చేయాలట. ఇది చర్మం లోపలి పొరల వెళ్లి తేమను నిలుపుతుందని, పగుళ్లను నింపడానికి సహాయపడుతుందని, రోజూ ఇలా చేస్తే మడమల పగుళ్ల సమస్యలు త్వరగా నయం అవుతాయని చెబుతున్నారు.

‎అదేవిధంగా పాదాల పగుళ్లను నివారించడంలో నిమ్మకాయ కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయలో ఉండే సహజ ఆమ్లం చనిపోయిన చర్మాన్ని తొలగిస్తుందట. అయితే వాసెలిన్ పాదాలను మృదువుగా చేస్తుందట. కాబట్టి టీస్పూన్ వ్యాస్లిన్​ లో కొన్ని చుక్కల నిమ్మరసం కలపీ రాత్రి సమయంలో మడమల మీద రాసి సాక్స్ ధరించాలట. ఈ మిశ్రమం రాత్రంతా చర్మానికి పోషణనిస్తుందని, పగుళ్లను త్వరగా తగ్గించడానికి హెల్ప్ చేస్తుందని చెబుతున్నారు. గ్లిసరిన్, రోజ్ వాటర్ మిశ్రమం కూడా పాదాల పగుళ్లను ప్రభావవంతంగా తగ్గిస్తుందట రెండు చెంచాల గ్లిసరిన్​ లో ఒక చెంచా రోజ్ వాటర్ కలిపి మడమల మీద రాయాలట. గ్లిసరిన్ చర్మంలో తేమను నింపుతుందని, రోజ్ వాటర్ చల్లదనాన్ని, మృదుత్వాన్ని ఇస్తుందని మడమలు బాగా పగిలిపోతే దీన్ని రోజూ వాడటం మంచిది అని చెబుతున్నారు.

  Last Updated: 11 Dec 2025, 07:58 AM IST