Yellow Teeth: పసుపు రంగులో ఉన్న దంతాలు తెల్లగా మిలమిల మెరవాలంటే ఇలా చేయాల్సిందే!

మామూలుగా చాలామందికి పళ్ళు గార పట్టి పసుపచ్చ రంగులో ఉంది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొందరికి అయితే పూర్తిగా పాచి పట్టిపోయి చూడడానికే చా

  • Written By:
  • Publish Date - January 30, 2024 / 07:55 PM IST

మామూలుగా చాలామందికి పళ్ళు గార పట్టి పసుపచ్చ రంగులో ఉంది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొందరికి అయితే పూర్తిగా పాచి పట్టిపోయి చూడడానికే చాలా అందవిహీనంగా, అధ్వానంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే దంతాలు పసుపు పచ్చ రంగులోకి మారడానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. అటువంటి వాటిలో మనం తీసుకునే ఆహార పదార్థాలు పానీయాలు ఇవన్నీ కూడా ఒక కారణం కావచ్చు. అయితే ఈ దంతాలు పసుపు పచ్చగా ఉన్నవారు నలుగురిలోకి వెళ్ళాలి అన్న కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ప్రతి ఒక్కరు కూడా తెల్లని ఆ ముత్యాల లాంటి దంతాలు కావాలని కోరుకుంటూ ఉంటారు. కానీ అది కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతూ ఉంటుంది. మీరు కూడా కొన్ని రకాల ప్రయత్నాలు చేస్తే మీ పళ్ళు తప్పకుండా తెల్లగా మారడం ఖాయం. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే..

ప్రతిరోజు ఉదయం ,పడుకునే ముందు రెండు సార్లు పళ్ళు తోముకోవడం వల్ల దంతాలపై పసుపు మచ్చలను పోగొట్టుకోవచ్చు. దంతాలు శుభ్రపడటంతో పాటు మంచి చిరునవ్వును సొంతం చేసుకోవచ్చు. క్రమం తప్పకుండా బ్రష్ చేయడం వల్ల దంతాలపై ఉండే మరకలు తొలగిపోతాయి. గారపట్టటం నిరోధించవచ్చు. నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే దంత వైద్యుడిని సంప్రదించి తగిన సూచనలు సలహాలు తీసుకోవటం మంచిది. అదేవిధంగా క్యాబేజీ వంటి కూరగాయలు, బెండకాయతో పాటు ఇతర పీచుకలిగిన పండ్లతో సహా మొత్తం పీచు పదార్ధాలను నమలటం ద్వారా దంతాలను ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. పీచు పదార్థాలు సహజమైన స్క్రబ్బర్లుగా పనిచేసి దంతాల పై బాగాన్ని శుభ్రపరుస్తాయి.

ఈ ఆహారాలను నమలడం వల్ల నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలకమైన లాలాజల ఉత్పత్తి ప్రేరేపించబడుతుంది. నోటిలోని ఆమ్లాలను తటస్థీకరించడంలో లాలాజలం కీలక పాత్ర పోషిస్తుంది. నోటి వాతావరణం ఆరోగ్యంగా ఉండేందుకు పీచు పదార్దాలు దోహదం చేస్తాయి. పైనాపిల్స్, బొప్పాయిలు, స్ట్రాబెర్రీల వంటి పండ్లలో ఎంజైమ్‌లు, తేలికపాటి ఆమ్లాలు ఉంటాయి, ఇవి మరకలను తొలగించి దంతాలను తెల్లగా మారేలా చేస్తాయి. నోటి ఆరోగ్యం కోసం మీ దంతవైద్యునితో సంప్రదించి తగిన ఆహార మార్పులు చేసుకోవాలి.పైనాపిల్స్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్‌లను విచ్ఛిన్నం చేసే సామర్థ్యాన్ని కలిగి దంతాలు తెల్లబడటంలో సహాయపడుతుంది. బ్రోమెలైన్ దంతాలపై మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. దంతాలు శుభ్రంగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. అలాగే బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. పపైన్ దంతాలపై పసుపు మచ్చలను తొలగించటంలో సహాయపడుతుంది. దంతాల తెల్లబడటానికి తోడ్పడుతుంది. బ్యాక్టీరియాతో పాటు దంతాలపై మరకలను తొలగించడానికి, కొబ్బరి లేదా నువ్వుల నూనెను 15-20 నిమిషాలు పుక్కిలించాలి. ఈ ఆయిల్ పుల్లింగ్ నోటిని శుభ్రపరచడం ద్వారా దంతాలను తెల్లగా మార్చడంలో సహాయపడుతుంది.