Beauty Tips: ట్యాన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే నిమ్మకాయతో ఇలా చేయాల్సిందే?

  • Written By:
  • Updated On - February 19, 2024 / 07:11 PM IST

ఎండలు మండిపోతున్నాయి. వేసవికాలం ఇంకా రాకముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో బయటకి రావాలి అంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఇకపోతే వేసవిలో ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. డిహైడ్రేషన్, కళ్ళు తిరగడం వంటి సమస్యలతో పాటు సన్‌ ట్యాన్, మొటిమలు, జిడ్డు చర్మం లాంటి చాలా సమస్యలు ఎదురవుతాయి. వీటి నుంచి విముక్తి పొందడానికి చాలా రకాల ప్రయత్నాలే చేస్తుంటారు. ఇక అమ్మాయిలు అయితే ఎండాకాలంలో ఎన్నో రకాల చిట్కాలను పరిహారాలను బ్యూటీ ప్రోడక్ట్ అయిన ఫాలో అవుతూ ఉంటారు. ఎన్ని చేసినప్పటికీ సన్‌ట్యాన్ సమస్య మాత్రం ఇబ్బంది పెడుతుంది. ఈ ట్యాన్‌ను పోగొట్టుకోవడానికి పార్లర్లకు వెళ్లి వేలకు వేలు డబ్బు ఖర్చు చేస్తుంటారు.

అలాకాకుండా ఇంట్లో ఉండే వస్తువులతోనే, రూపాయి ఖర్చు లేకుండా సులభంగా ట్యాన్‌ పోగొట్టుకోవచ్చు. నిమ్మరసం, రోజ్ వాటర్, దోసకాయ రసం కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. నిమ్మరసం సిట్రిక్ యాసిడ్, ఇది టాన్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. దోసకాయ, రోజ్ వాటర్ కూలింగ్ ఏజెంట్లు.
కొంచెం తేనె, నిమ్మరసం కలిపి ట్యాన్‌ పట్టిన ప్రాంతంలో రాయాలి. ఇది యాంటీ ట్యాన్‌ ప్యాక్ మిశ్రమాలలో ఒకటి. అలాగే కొన్ని పచ్చి పాలు, పసుపు, కొంత నిమ్మరసం వేసి పేస్ట్‌ను సిద్ధం చేసుకోండి. ఈ పేస్ట్‌ చర్మంపై అప్లై చేసి, ఆరిపోయే వరకు ఉంచాలి. ఆ తర్వాత కాస్త చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇది ట్యాన్ ను తొలగిస్తుంది. శెనగపిండి, నిమ్మరసం, కొంత పెరుగు కలిపి ట్యాన్‌ ఎఫెక్టెడ్‌ ప్రాంతంలో రాయాలి.

ఇలా రోజూ చేస్తే మీ ట్యాన్‌ తొలగి చర్మం గ్లో అవుతుంది. తాజా నిమ్మరసాన్ని మోచేతులు, మోకాళ్లు ఇలా నల్లగా ఉన్న ప్రాంతాల్లో రాయాలి. కనీసం 15 నిమిషాలు అలానే ఉంచి ఆతర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ఆ ప్రాంతాల్లో ట్యాన్‌ తొలగి చర్మం తెల్లాగా మారుతుంది. పాలపొడి, నిమ్మరసం, తేనె, బాదం నూనె సమాన భాగాలతో కలిపి ఒక క్రీమ్ తయారు చేసుకోంది. ఇది ట్యాన్‌ ఉన్న ప్రాంతాల్లో రాసి 20 నిమిషాలు అలాగే ఉంచండి. ఇది ఒక వారం నిల్వ ఉంచుకోవచ్చు. ట్యాన్ తొలగించడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. పసుపు, నిమ్మరసం కలిపిన పేస్ట్‌ను వారానికి మూడుసార్లు చర్మానికి అప్లై చేయండి. ఇది చర్మం రంగును మెరుగుపరుస్తుంది. టాన్‌ను తొలగిస్తుంది.

ఇందుకోసం రెండు స్పూన్ల శనగపిండికి చిటికెడు పసుపు, అర టీస్పూను నారింజ తురుము, ఒక టీస్పూను రోజ్‌ వాటర్‌ వేసి కలిపి అప్లై చేసి, 20 నిమిషాలు ఆగి ఆరిపోయిన ప్రదేశాల్లో రోజ్‌ వాటర్‌ చిలకరించాలి. తర్వాత వేళ్లతో సున్నితంగా రుద్దుతూ ప్యాక్‌ తొలగించి కడిగేసుకోవాలి. ఇలా రెండు రోజులకి ఒకసారి ఇలా చేయాలి.

అదేవిధంగా రెండు చెంచాల ముల్తానీమట్టిలో సరిపడా రోజ్‌వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. సమస్య ఉన్న ప్రదేశంలో ఈ మిశ్రమాన్ని ప్యాక్‌లా అప్త్లె చేసి పూర్తిగా ఆరేంత వరకు వేచి ఉండాలి. ఆ తర్వాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకోసారి చొప్పున వారం రోజుల పాటు క్రమం తప్పకుండా చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇంట్లో ఉంటే ముల్తానీమట్టికి బదులుగా చందనం లేదా గంధం కూడా ఉపయోగించవచ్చు.