Site icon HashtagU Telugu

‎Intestinal Worms: కడుపులో నులిపురుగుల సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే!

Intestinal Worms

Intestinal Worms

Intestinal Worms: చాలామంది చిన్న పెద్ద అని తేడా లేకుండా కడుపులో నులిపురుగుల సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ నులి పురుగుల కారణంగా కడుపునొప్పి ఆకలిగా లేకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. పెద్దలతో పోల్చుకుంటే చిన్నపిల్లల్లో ఈ నులిపురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ నులిపురుగుల సమస్యను తగ్గించుకోవడానికి రకరకాల మెడిసిన్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వాటితో పాటు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటిస్తే నులిపురుగుల సమస్య అసలు ఉండదని చెబుతున్నారు.

‎మరి అందుకోసం ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా ఇందుకోసం ఒక చెంచా పచ్చి బొప్పాయి రసం తీసుకుని దానిలో తేనె కలిపి పరగడుపున ఉదయం సమయంలో తాగాలి. పచ్చి బొప్పాయి కడుపులో ఉండే నులి పురుగులను చంపుతుందట. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం పరగడుపున 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలను నమిలి నీరు తాగాలి. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు కడుపులోని పురుగులను చంపడానికి సహాయపడతాయట. అదేవిధంగా కొన్ని తాజా వేపాకులను తీసుకొని మెత్తగా నూరి రసం తీసి ఉదయం పరగడుపున తాగాలట.

‎కావాలంటే వేప పొడి కూడా తీసుకోవచ్చట. వేప యాంటీ పరాసిటిక్గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని క్రిములను బయటకు పంపడానికి సహాయపడుతుందట. అలాగే ఒక గ్లాసు వేడి నీరు లేదా పాలల్లో అర టీస్పూన్ పసుపు కలిపి ఉదయాన్నే తీసుకోవాలట. పసుపు సహజ క్రిమినాశకిని. ఇది పేగులను శుభ్రపరచడానికి, పురుగులను తొలగించడానికి సహాయపడుతుందట. ‎గుమ్మడికాయ గింజలను వేయించి తినాలట. లేదా పొడి చేసి నీరు లేదా పాలతో తీసుకోవాలట. వాటిలో ఉండే సమ్మేళనాలు కడుపులోని పురుగులను శరీరం నుంచి బయటకు పంపడానికి సహాయపడతాయట. ‎చిటికెడు వామును బెల్లంతో కలిపి ఉదయం పూట తినాలట. ఈ మిశ్రమం కడుపులో ఉండే పురుగులను చంపుతుందని, జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. పైన చెప్పిన చిట్కాలు పాటించడం వల్ల కడుపులో నులిపురుగుల సమస్య ఉండదట. చిన్నపిల్లలు అయితే పైన చెప్పిన చిట్కాలు పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Exit mobile version