Site icon HashtagU Telugu

Head Lice Remedies: తలలో పేలు ఇబ్బంది పెడుతున్నారా.. అయితే ఈ సింపుల్ టిప్స్‌ ఫాలో అవ్వాల్సిందే?

Mixcollage 02 Mar 2024 08 10 Am 4288

Mixcollage 02 Mar 2024 08 10 Am 4288

మామూలుగా స్త్రీ పురుషులకు చాలామందికి తలలో పేలు సమస్య విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. పేలు దండిగా ఉండి రాత్రిళ్ళు సరిగా నిద్ర కూడా పట్టదు. అంతేకాకుండా దురద పెడుతూ ఉంటుంది. మామూలుగా తలలో పేలు ఉష్ణోగ్రత అనుకూలంగా ఉన్నప్పుడు వృద్ధి చెందుతాయి. అయితే పేల సమస్య ను సులభంగా తొలగించుకోలేము. దీంతో కొందరు యాంటీ పేల షాంపూ ఉపయోగిస్తారు. దీనివలన తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభిస్తుంది. దీంతో రసాయనిక షాంపులను పక్కకు పెట్టి పేల నుంచి విముక్తి కోసం ఇంట్లో దొరికే వస్తువులతో కొన్ని చిట్కాలను పాటిస్తే ఆ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

మరి ఎలాంటి చిట్కాలు పాటిస్తే పేలు సమస్య తగ్గుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జుట్టు రాలడం, చుండ్రు, చివర్లు చీలడం-ఇవి చాలా సాధారణ సమస్యలు. జుట్టు గురించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలను సులభంగా తొలగించవచ్చు. అయితే తలలో ఉండే పేల వల్ల రాత్రి నిద్రకు భంగం కలుగుతుంది. పేలను వదిలించుకోవటం సులభం కాదు. టీ ట్రీ ఆయిల్, లావెండర్, పిప్పరమెంటు, వేప వంటి అనేక ముఖ్యమైన నూనెలు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి పేను సమస్యను దూరం చేస్తాయి.

కొబ్బరి నూనెతో 15-20 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేసి తలకు, జుట్టు కుదుల్లకు బాగా అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత షాంపూతో స్నానం చేయాలి. ఇలా చేస్తే 7 రోజుల్లో పేల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే పేల నుంచి విముక్తి కోసం వేప ఆకులను ఉపయోగించవచ్చు. వేప ఆకులను పేస్ట్ చేసి అందులో పుల్లటి పెరుగు కలిపి జుట్టుకు తలకు పట్టించాలి. 30-45 నిమిషాలు వదిలి షాంపూ చేయాలి. మీరు వేప ఆకులకు బదులుగా వేప నూనెను కూడా రాసుకోవచ్చు.
వెనిగర్ తో పేలకు చికిత్స చేయవచ్చు. 1/2 కప్పు నీటిలో 2 టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించాలి. 30 నిమిషాల పాటు అలాగే ఉంచి షాంపూతో జుట్టుని శుభ్రం చేసువాలి. దీంతో పేల నుంచి విముక్తి లభిస్తుంది.