అందమైన మెరిసే ముఖాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు.. కొందరు బ్యూటీ పార్లర్ ల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు డబ్బులు ఖర్చు చేసుకుంటూ ఉంటారు. అయితే కొంతమందికి ముఖంపై నల్లటి మచ్చలు ఉంటే మరికొందరికి పింపుల్స్ వచ్చి ఆ పింపుల్స్ పోయిన తర్వాత చిన్న గుంతలు లాగా ఏర్పడుతూ ఉంటాయి. అవి పోగొట్టుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు.
మహిళలు వాటిని మేకప్ తో కవర్ చేసినప్పటికీ అబ్బాయిలు వాటిని ఎలా కవర్ చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటారు. అయితే మీరు కూడా అలా ముఖంపై గుంతల సమస్యలతో బాధపడుతున్నారా.. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం ముల్తాన్ని మట్టి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఈ ముల్తాని మట్టి ముఖంపై ఉన్న రంద్రాలను తగ్గిస్తుంది. ఇందుకోసం ముల్తాని మట్టిలో కాస్త నిమ్మరసంలో రోజ్ వాటర్ కలిపి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు.
అదేవిధంగా శనగపిండిలో పెరుగును కలిపి ముఖంపై అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.. అయితే ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కనిపిస్తాయని చెబుతున్నారు.. అలాగే చిన్నపాటి ఐస్ క్యూబ్స్ ని తీసుకుని ఒక కాటన్ క్లాత్ లో చుట్టి ఓపెన్ రంద్రాలపై కొన్ని సెకండ్ల పాటు అలాగే ఉంచాలి. ఈ విధంగా చేస్తే ముఖంపై ఉన్న రంద్రాలు మూసుకుపోయి ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.