Nerve pain : నరాల బలహీనతా, అయితే ఇలా చేస్తే, మీరు శక్తి వంతులు అవుతారు..!!

నాడీవ్యవస్థ శరీరం మొత్తం వ్యాపించి ఉంటుంది. శరీర భాగాలకు ఏదైనా గాయం లేదా ఒత్తిడి ఎదురైనప్పుడు నరాల బలహీనతకు దారి తీస్తుంది.

  • Written By:
  • Publish Date - August 29, 2022 / 07:00 PM IST

నాడీవ్యవస్థ శరీరం మొత్తం వ్యాపించి ఉంటుంది. శరీర భాగాలకు ఏదైనా గాయం లేదా ఒత్తిడి ఎదురైనప్పుడు నరాల బలహీనతకు దారి తీస్తుంది. అనారోగ్యకరమైన ఆహారం,మందులు, అంటువ్యాధులు, జన్యుశాస్త్రం, పోషకాహారలోపం కూడా నరాల బలహీనతకు దారితీస్తుంది. నరాల బలహీనతను నయం చేయడంలో ఇంటి నివారణలు లేదంటే సహజచికిత్సా పద్దతులు ప్రభావవంతంగా పనిచేస్తాయి. నరాల నొప్పులు ఏ వయస్సులోనై ప్రభావితం చేస్తుంది. అందుకని నరాల సమస్య చిన్నదని నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే ఇతర జబ్బులకు దారి తీసే అవకాశం ఉంటుంది. నరాల బలహీనను నయం చేయడంలో సహజనివారణలు లేదా ఇంటి చిట్కాలు చాలా ప్రభావంతంగా పనిచేస్తాయి. అవేంటో ఓసారి చూద్దాం.

నరాల శరీరంలో ఏ భాగంలోనైనా కనిపించవచ్చు:
రక్తం గడ్డకట్టడం వల్ల కలిగే నొప్పి సాధారణంగా కొన్ని గంటల నుండి కొన్ని రోజుల వరకు ఉంటుంది. ఇది ఎవరికైనా ఇబ్బంది కలిగించే సమస్య. ఇది చాలా చిన్న విషయంగా అనిపించినా చాలా బాధ కలిగిస్తుంది. మన శరీరంలో అనేక నాడులు ఉంటాయి. ఒక్కో భాగానికి అనేక నాడులు ఉంటాయి. ఏదైనా అవయవం యొక్క నరాల నొప్పి భరించడం కష్టం.

పాదాలను జాగ్రత్తగా చూసుకోండి:
పాదాలు నరాల నొప్పితో బాధపడుతుంటే, పాదాల సంరక్షణపై దృష్టి పెట్టాలి. నరాల నొప్పి సాధారణంగా పేలవమైన అనుభూతిని కలిగిస్తుంది. పాదాలపై గాయాలు అయితే నిర్లక్ష్యం చేయకూడదు. అవి అంటువ్యాధులకు దారితీస్తుంది. మీ పాదాలకు సౌకర్యవంతమైన చెప్పులను ధరించాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్:
మీరు నరాల బలహీనతతో బాధపడుతున్నట్లయితే ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం మీ శరీరంలోని నరాల నొప్పుల సమస్యను తగ్గిస్తుంది. ఒక గ్లాసు వేడి నీటిలో 2-3 చెంచాల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి, రుచికోసం తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని వారానికి రెండుసార్లు తాగండి. మంచి ఫలితం ఉంటుంది.

వేడి నీళ్ల స్నానం:
వెచ్చని స్నానం నరాల నొప్పికి ఔషదంలా పనిచేస్తుంది. గోరువెచ్చని నీళ్లు రక్త ప్రసరణను తాత్కాలికంగా పెంచుతుంది. అంతేకాదు ఒత్తిడిని తగ్గించడంలోనూ సహాయపడుతుంది.

నీటిలో ఉప్పు వేసుకుని స్నానం చేయండి:
మీకు నరాల నొప్పులు ఉంటే, మీరు స్నానం చేసే ముందు నీటిలో కొంచెం ఉప్పు కలపండి. ఉప్పుమీ శరీరంలోని నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. .

పసుపు తినండి:
మీకు శరీరంలోని ఏదైనా భాగంలో నరాల నొప్పులు ఉంటే, పసుపును చిన్న చిన్న గోలిళ్ల వలే చేసుకుని తినండి. పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మీ శరీరంలోని నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు ఒక కప్పు వేడి పాలలో పావు టీస్పూన్ పసుపు కలుపుకుని తాగండి. మంచి ఫలితం ఉంటుంది.