Summer: మాడు పగిలే ఎండలు.. భానుడి భగభగలకు చెక్ పెడుదాం ఇలా!

  • Written By:
  • Updated On - April 4, 2024 / 11:37 AM IST

Summer: ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రమంటున్నాడు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరూ సమ్మర్ బారిన పడుతున్నారు. మున్ముందు ఎండల పెరిగే అవకాశం ఉండటంతో భానుడు తన ప్రతాపాన్నిమరింత చూపే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వాతావరణం మారినప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. శరీరాన్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. జ్వరం, జలుబు, దగ్గు, అలర్జీ, చర్మ సమస్యలు, డీహైడ్రేషన్‌ వంటి సమస్యలు వస్తాయి.

ఇవి దరి చేరకుండా ఉండేందుకు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చెమట ఎక్కువగా పట్టడంతో శరీరంలోని నీటి శాతం తగ్గుతుంది. దీని వల్ల డీహైడ్రేషన్‌కు గురవుతారు. నీరసం, కళ్లు తిరగడం, తల తిరగడం, చెమట ఎక్కువగా పట్టడం, నోరు ఎండిపోవడం, వాంతులు, విరేచనాలు వంటివి అవుతాయి. కాటన్ దుస్తులు ధరించాలి.వేసవి కాలంలో ఎక్కువసేపు బయట ఉండడం వలన వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు రావచ్చు. చర్మ క్యాన్సన్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

మధ్యాహ్నం సమయంలో బయటకు రాకుండా ఉండాలి.. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలి. పనులు ఉదయం, సాయంత్రం వేళల్లో చేసుకోవాలి. మధ్యాహ్నం బయటకు వెళితే గొడుగు, తాగునీరు తీసుకెళ్లాలి. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. జ్వరం, ఆందోళన, ఊపిరాడకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.వేసవి తాపానికి విరుగుడుగా ఆరోగ్యాన్నిచ్చే పండ్ల రసాలు తీసుకోవాలి. వీటిని ఇంట్లో తేలిక పద్ధతులలో తయారుచేసుకోవచ్చు. బయటకు వెళ్లాల్సి వస్తే ఉదయం లేదా సాయంత్రం సమయంలో వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి. మట్టికుండల్లో నీటిని తాగాడంతో పాటు పళ్ల రసాలు దానిమ్మ, బత్తాయి, ద్రాక్ష లాంటివి తీసుకోవాలి.

ఒక్క తెలంగాణలోనే 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ అయిదంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.  ఆంధ్రప్రదేశ్‌లో 36 మండలాల్లో వడగాల్పులువీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న మూడు రోజులు వాడగాలులు వీస్తాయని తెలిపింది. ఉష్ణోగ్రతలు కూడా మరింత పెరుగుతాయని హెచ్చరించింది.