Cholesterol: కొలెస్ట్రాల్ ఉన్నవారు వీటిని తింటే ప్రాణానికి ప్రమాదం.. అవేంటంటే?

శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే

  • Written By:
  • Publish Date - November 27, 2022 / 08:30 AM IST

శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు దానిని నిర్లక్ష్యం చేయకుండా అందుకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మరి ముఖ్యంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా దూరంగా ఉండాలి. నిర్లక్ష్యం చేస్తే కొలెస్ట్రాల్ సమస్య పెరగడం మాత్రమే కాకుండా గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మరి కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ఎటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు మాంసం తినక పోవడమే మంచిది. ఎందుకంటే మాంసం తినడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య మరింత పెరుగుతుంది. దానివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మాంసాన్ని ఎక్కువగా తినడం కంటే కొద్దిగా పరిమితిలోనే మించి తినడం మంచిది. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే చికెన్ తినకపోవడమే మంచిది. చికెన్ ఎక్కువగా తినడం వల్ల అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. అయితే కొంతమంది కొలెస్ట్రాల్ సమస్య ఉన్నప్పుడు ఏం కాదులే అని చికెన్ తింటూ ఉంటారు. ఆ తినడం వల్ల ఆ సమస్య మరింత పెరుగుతుంది.

సాధారణంగా పాలు పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. కానీ కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు మాత్రం ఈ పాలను పాలతో తయారు చేసిన ఉత్పత్తులను తినరాదు. పాలు జున్నులో ఎక్కువగా కొవ్వు ఉంటుంది. దానివల్ల బరువు పెరగడంతో పాటు ఒంట్లో కొలెస్ట్రాల్ కూడా బాగా పెరుగుతుంది. అందుకే పాలు పాల ఉత్పత్తులను తీసుకోకపోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.