Married Women : పెళ్లయిన మహిళలకు త్వరగా హైబీపీ.. షాకింగ్ సర్వే రిపోర్ట్

Married Women : మ్యారేజ్ అయిన మహిళల హెల్త్‌పై జరిగిన ఓ రీసెర్చ్‌లో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.

Published By: HashtagU Telugu Desk
Married Women

Married Women

Married Women : మ్యారేజ్ అయిన మహిళల హెల్త్‌పై జరిగిన ఓ రీసెర్చ్‌లో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. పెళ్లి కాని మహిళలతో పోలిస్తే.. మ్యారేజ్ అయిన మహిళల్లో హైబీపీ త్వరగా వచ్చే ఛాన్స్ ఉందని తేలింది.  అయితే అమెరికాకు చెందిన పరిశోధకులు 10000 మందికిపైగా జంటలను తీసుకొని, దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఓ సర్వే చేశారు. పెళ్లికాని, పెళ్లైన వారి, బరువు, శారీరక శ్రమ, అల్కహాల్, గుండె స్పందన రేటులో ఉన్న తేడాలను పరిశీలించి పై నిర్ధారణకు వచ్చారు.

We’re now on WhatsApp. Click to Join

పెళ్లయిన తర్వాత మహిళలకు(Married Women) హైబీపీ వచ్చే ఛాన్స్‌లు పెరుగుతున్నాయని తాజా అధ్యయనంలో తేలినట్లు సమాచారం. ఒక వేళ భర్తకు అధిక రక్తపోటు లేదా హైబీపీ ఉంటే అది భార్యకు కూడా వచ్చే అవకాశం 19 శాతం ఎక్కువని స్టడీలో తేలింది. ఈమేరకు వివరాలతో కూడిన అధ్యయన నివేదికను ‘జర్నల్ ఆఫ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్’లో పబ్లిష్ చేశారు. భార్యభర్తలు మనుషులు వేరైనా మనుసులు ఒకటే? ఇద్దరి అభిరుచులు, జీవన విధానం ఒకే విధంగా ఉండటం వల్ల  వారి ఆరోగ్య ఫలితాలు ఒకేలా ఉంటున్నాయని పరిశోధకులు చెప్పారు. 50 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న జంటలలో 35 శాతం మందికి హైబీపీ రిస్క్ ఉందని సర్వే నివేదిక తేల్చింది. హైబీపీ లేదా అధిక రక్తపోటు అనేది శరీరంలోని ధమనులను ప్రభావితం చేసే ఒక ఆరోగ్య పరిస్థితి. ఇది గుండెను ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. దీనికి చికిత్స తీసుకోకపోతే గుండెపోటు వచ్చే ముప్పు ఉంటుంది.

Also Read : Paytm – RBI : పేటీఎంపై ఆర్​బీఐ ఆంక్షలు.. ఆగిపోయే సేవలు, కొనసాగే సేవలివీ

ఏ వయసు పిల్లలకు హైబీపీ రిస్క్ ఎక్కువ

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పిల్లల్లో అధిక రక్తపోటు సమస్య జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి. పిల్లలకు 5 నుంచి 10 సంవత్సరాలలోపు వయస్సు ఉన్నప్పుడు, వారిలో బీపీ పెరిగే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అయినప్పటికీ, పెద్దవారితో పోలిస్తే పిల్లలలో హైబీపీ కేసులు తక్కువగా ఉంటాయి. పిల్లలలో అధిక బీపీ ప్రారంభ లక్షణాల గురించి చూస్తే ప్రధానంగా ఐదు ఉంటాయని చిల్డ్రన్‌ స్పెషలిస్ట్‌ చెబుతున్నారు. గుండె జబ్బులతో లేదా అధిక బరువుతో పుట్టిన పిల్లలకు అధిక రక్తపోటు సమస్య ఎక్కువగా ఉంటుంది. బిడ్డ పుట్టుకతో బలహీనంగా ఉన్నా.. రక్తపోటుకు గురవుతాడు. అటువంటి పరిస్థితిలో సరైన చికిత్స సమయానికి అందించబడకపోతే, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.

  Last Updated: 02 Feb 2024, 10:11 AM IST