Site icon HashtagU Telugu

Hibiscus Tea: చలికాలంలో మందారం టీ తాగడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే?

Mixcollage 17 Dec 2023 04 36 Pm 8463

Mixcollage 17 Dec 2023 04 36 Pm 8463

మందారం మొక్క వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మన చుట్టూ ఉండే పరిసర ప్రాంతాల్లో ఈ మొక్కలను ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. ఈ మందారం చెట్టు ఆకులు, పువ్వులు ఎంతో బాగా ఉపయోగపడతాయి. వీటిని ఎక్కువగా అందం కోసం ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మందారం ఆకులు కేవలం అందానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో బాగా పనిచేస్తాయి అంటున్నారు నిపుణులు.. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే మందార ఆకులను ఎండబెట్టి పొడి చేసుకొని వాటితో టీ తయారు చేసుకోవచ్చట. మరి ఈ మందార టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు విషయానికి వస్తే..

మందారలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. జుట్టు ఆరోగ్యానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో అధికంగా ఉన్నాయి. కణజాలతో సమృద్ధిగా ఉన్న మందార టీ జుట్టుని బలోపితం చేయడానికి సహాయపడుతుంది. దీన్ని జుట్టుకి అప్లై చేయడం వలన చాలా ఉపయోగాలు ఉంటాయి. అయితే బరువు తగ్గాలనుకునే వాళ్ళు మందార టీ తీసుకోవచ్చు. ఈ మందార టీ లో ఎంజైములు ఉంటాయి. కాబట్టి శరీరంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది. ఇది బరువుని తగ్గించడంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.

గుండెకు మేలు చేసే చెడు కొలెస్ట్రాలు గుండెకు చాలా ప్రమాదకరం ఈ మందారంలోని యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాలను అదుపులో ఉంచుతాయి. అలాగే మందార పూలతో చేసిన హెర్బల్ టీ రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడడానికి ఈ మందార పువ్వులు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్, యాంటీ పరాసిటిక్ గుణాలు ఉంటాయి. ఈ మందార పూలతో చేసిన టీ తీసుకోవడం వలన ఫంగస్ బ్యాక్టీరియా లాంటి అనేక రకాల శారీరిక ఇన్ఫెక్షన్ నుంచి బయటపడవచ్చు. షుగర్ వ్యాధికి చాలా మేలు చేస్తుంది. మందార ఆకుల సారం యాంటీ బయాటిక్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ మందార టీ తీసుకోవడం వలన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.