Site icon HashtagU Telugu

Hibiscus for hair growth: మందారంలో ఇది కలిపి రాస్తే చాలు.. మెరిసిపోయే జుట్టు మీ సొంతం?

Hibiscus For Hair Growth

Hibiscus For Hair Growth

చాలామంది మందార పువ్వులను పూజకు ఉపయోగించడంతోపాటు పెట్టుకోవడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమంది మందార పువ్వును అందానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కువగా జుట్టుకు సంబంధించిన సమస్యల కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మందార పువ్వు నువ్వు జుట్టుకు ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వారు మందారాన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మీకు జుట్టు అధికంగా ఊడిపోతుంటే ఈ సమస్యను పరిష్కరించడానికి మందారం ఉపయోగించవచ్చు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి మందార పూలను ముద్దగా చేసి అందులో రెండు లేదా మూడు చుక్కల బాదం నూనె, 2 చెంచాల ఉసిరి పొడి వేసి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను తలకు, జుట్టుకు అప్లై చేసి షవర్‌ క్యాప్‌ పెట్టుకోవాలి. ఇలా రెండు గంటల పాటు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.

చుండ్రు సమస్య ఇబ్బంది పడుతుంటే.. నాలుగు టేబుల్‌స్పూన్ల హెన్నా పొడిలో ఎండబెట్టి పొడి చేసిన మందార ఆకులు, పువ్వుల పొడిని కొద్దిగా వేసి, ఈ మిశ్రమానికి కాస్త ఉసిరి పొడి, మెంతుల పొడి వేసి మిక్స్‌ చేయాలి. ఇప్పుడు ఇందులో కొద్దికొద్దిగా పెరుగు వేసుకుంటూ పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి ఆరనివ్వాలి. ఆ తర్వాత.. గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది.

జుట్టు దృఢంగా పెరగాలి అనుకునే వారు ఆరు లేదా ఏడు మందారపూలను, పదిహేను మందార ఆకులను తీసుకుని పేస్ట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత నాలుగు టేబుల్‌ స్పూన్ల కొబ్బరినూనె గోరువెచ్చగా వేడిచేయాలి. అది చల్లారిన తర్వాత ఈ పేస్ట్‌ను బాగా మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని జట్టుకు పట్టించి గంట పాటు ఆరనివ్వాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు కదుళ్లు స్ట్రాంగ్‌ అవుతాయి. జుట్టు పెరుగుదల కూడా ఎక్కువగా ఉంటుంది. మందారపూలు, ఆకుల్ని సమాన పరిమాణంలో తీసుకుని కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్‌ చేసుకోవాలి. ఆ పేస్ట్‌కు నాలుగు టేబుల్‌ స్పూన్ల అలొవెరా జెల్‌ను వేసి మిశ్రమాన్ని మిక్స్‌ చేయాలి. ఈ పేస్ట్‌ను తలకు పట్టించి.. ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. పట్టు లాంటి జుట్టు కోసం టేబుల్‌ స్పూన్ల పెరుగులోకి, ఎండబెట్టిన మందార పూల పొడిని వేసి కలపాలి. ఈ చూర్ణాన్ని జుట్టుకు పట్టిస్తే మాడు చల్లగా ఉంటుంది. ఇది ఆరిన తర్వాత తలస్నానం చేయాలి

Exit mobile version