Site icon HashtagU Telugu

Hibiscus for hair growth: జుట్టు బాగా మెరవాలంటే.. మందారంతో ఇలా చేయాల్సిందే?

Hibiscus For Hair Growth

Hibiscus For Hair Growth

స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా అందమైన పట్టు లాంటి జుట్టుకావాలని కోరుకుంటూ ఉంటారు. అయితే అందమైన జుట్టు కోసం రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ మార్కెట్లో దొరికే ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ని హోమ్ రెమిడీస్ ని ఫాలో అవుతూ ఉంటారు. అయినా కూడా ఫలితం లేక చాలామంది దిగులు చెందుతూ ఉంటారు. అయితే మీకు అందమైన పట్టు లాంటి జుట్టు కావాలి అంటే మందారంతో ఇలా చేయాల్సిందే. మరి అందమైన జుట్టు కోసం మందారం తో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన పూలలో మందారం ఒకటి. మందార పువ్వులు చూడటానికి అందంగా ఉంటాయి.

మందారంలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. మందారంలోని పోషకాలు జుట్టు సంరక్షణలో సహాయపడతాయి. ఇందులో ఫ్లేవనాయిడ్స్‌, అమినో యాసిడ్స్‌ మెండుగా ఉంటాయి. ఇవి స్కాల్ప్‌లో రక్త ప్రసరణను పెంచడానికి, హెయిర్‌ ఫోలికల్స్‌ను ప్రేరేపించడానికి తోడ్పడతాయి. ఇది కెరాటిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. జుట్టుకు సహజమైన షైన్‌, ఆకృతిని అందిస్తుంది. మందారంలోని ఫ్లేవనాయిడ్లు హానికరమైన యూవి కిరణాల నుంచి మన జుట్టును రక్షిస్తాయి. దీనిలో అద్భుతమైన శీతలీకరణ లక్షణాలు శిరోజాలను రిలాక్స్‌ చేస్తాయి. కాగా ఒకవేళ మీకు జుట్టు అధికంగా ఉండుతుంటే.. ఈ సమస్యను పరిష్కరించడానికి మందారం ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.

ఈ సమస్యకు చెక్క్‌ పెట్టడానికి మందార పూలను ముద్దగా చేసి అందులో రెండు లేదా మూడు చుక్కల బాదం నూనె, 2 చెంచాల ఉసిరి పొడి వేసి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను తలకు, జుట్టుకు అప్లై చేసి షవర్‌ క్యాప్‌ పెట్టుకోవాలి. ఇలా రెండు గంటల పాటు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేయండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే హెయిర్‌ ఫాల్‌ కంట్రోల్‌లో ఉంటుంది. అదేవిధంగా చుండ్రు సమస్య ఇబ్బంది పెడుతుంటే వెంటనే నాలుగు టేబుల్‌స్పూన్ల హెన్నా పొడిలో ఎండబెట్టి పొడి చేసిన మందార ఆకులు, పువ్వుల పొడిని కొద్దిగా వేసి, ఈ మిశ్రమానికి కాస్త ఉసిరి పొడి, మెంతుల పొడి వేసి మిక్స్‌ చేయాలి. ఇప్పుడు ఇందులో కొద్దికొద్దిగా పెరుగు వేసుకుంటూ పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి ఆరనివ్వాలి.

ఆ తర్వాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చుండ్రు సమస్య దూరం అవుతుంది. అలాగే జుట్టు దృఢంగా ఉండడం కోసం ఆరు లేదా ఏడు మందార పూలు, పదిహేను మందార ఆకులు తీసుకుని పేస్ట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత నాలుగు టేబుల్‌ స్పూన్ల కొబ్బరి నూనె గోరువెచ్చగా వేడిచేయాలి. అది చల్లారిన తర్వాత ఈ పేస్ట్‌ను బాగా మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని జట్టుకు పట్టించి గంట పాటు ఆరనివ్వాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టు కదుళ్లు స్ట్రాంగ్‌ అవుతాయి. జుట్టు పెరుగుదల కూడా ఎక్కువగా ఉంటుంది.