Hibiscus Benefits: మందారం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మన అందరికి తెలిసిందే. మందారం జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో ఎంత బాగా ఉపయోగపడుతుంది. కాగా మందార పువ్వులు, ఆకుల్లో అమైనో ఆమ్లాలు, వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కుదుళ్లను బలంగా మార్చి జుట్టు ఎదుగుదలకు ప్రోత్సహిస్తాయట. అంతేకాకుండా జుట్టు నిర్జీవంగా కనిపించినప్పుడు, మందార పూలను మెత్తగా రుబ్బి దానికి కాస్త పెరుగు కలిపి తలకు రాసుకోవాలని చెబుతున్నారు.
అరగంటయ్యాక గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుందట. ఇలా చేయడం వల్ల జుట్టు చివర్లు చిట్టకుండా ఉండటంతో పాటు జుట్టు రాలడం తగ్గుతుందట. మందార పువ్వు, ఆకులు చాలా శ్లేష్మం కలిగి ఉంటాయని, ఇది సహజ కండిషనర్ గా పనిచేస్తుందని చెబుతున్నారు. కాగా మందార పువ్వుల్ని పేస్ట్ చేసి అందులో కాస్త నిమ్మరసం పిండి, తలకు ప్యాక్ చేసుకోవాలట. ఈ ప్యాక్ సహజంగా కురులకు తేమను అందించడంతో పాటు చుండ్రునీ కూడా తగ్గిస్తుందట. అంతేకాకుండా త్వరగా తెల్ల జుట్టు రాకుండా ఉంటుందట. ఇందులో ఉండే పోషకాలు యూవీ కిరణాల నుంచి రక్షణ కల్పిస్తుందని చెబుతున్నారు. కాగా మందార పువ్వులు అందానికి కూడా సహాయపడతాయి అంటున్నారు నిపుణులు.
పొడిచర్మం ఉన్నవాళ్లు ఈ మిశ్రమాల్ని పూతలా వేసుకుంటే సరిపోతుందట. వీటిల్లో ఉండే ఆల్ఫాహైడ్రాక్సీ ఆమ్లాలు మృతకణాల్ని తొలగిస్తాయట. దీంతో ప్రకాశవంతమైన చర్మం మీ సొంతమవుతుందట. పిగ్మెంటేషన్, నల్లటి మచ్చలతో బాధపడేవారు వీటి మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ లా వేసుకుంటే చక్కని ఫలితాలు కలుగుతాయట. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమల్ని అదుపుచేస్తాయట. అయితే మందార పువ్వులను ఎలా అప్లై చేయాలి అన్న విషయానికి వస్తే.. మందార రేకుల మిశ్రమాన్ని పెరుగు లేదా తేనెను కలపాలి. ఆపై ఫేస్ కి అప్లై చేసుకొని, 15 నుంచి 20 నిమిషాలు తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేస్తే సరిపోతుందట. లేకపోతే మందార పువ్వుల్ని ఎండలో పెట్టి పొడిలా చేసి వేడినీటిలో కలుపుకొని, అది కాస్త చల్లారక స్ప్రే బాటిల్లోకి వేసుకుని టోనర్‌లా కూడా ఉపయోగించవచ్చట. అంతేకాకుండా మందార పువ్వుల్ని ఎండబెట్టి పొడిగా చేసిన తర్వాత బాదం, కొబ్బరి నూనెల్లో ఈ పౌడర్ ని కలిపి ముఖానికి మర్దనా చేసుకోవచ్చని చెబుతున్నారు.
Hibiscus Benefits: జుట్టుతో పాటు అందానికి కూడా మేలు చేసే మందారం.. ఎలా ఉపయోగించాలోతెలుసా?

Hibiscus Benefits