Site icon HashtagU Telugu

Yogurt Tips : మెరిసే స్కిన్ మీ సొంతం అవ్వాలంటే పెరుగుతో ఈ విధంగా చేయాల్సిందే?

Yogurt To Get Glowing Skin..

Here's What To Do With Yogurt To Get Glowing Skin..

Yogurt Tips for Glowing Skin : పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే పెరుగు వల్ల కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. పెరుగులోని (yogurt) భాగాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మాన్ని మృదువుగా చేస్తాయి. తేమగా మారేలా చేస్తాయి. దీని వల్ల చర్మ రంగు మారి అందంగా మారతారు. మరి పెరుగుతో (yogurt) మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవడం కోసం ఎలాంటి రెమెడీలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

శనగపిండి అనేది చర్మానికి చాలా మంచిది. దీనిని ఉపయోగించడం వల్ల వల్ల మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. శనగపిండిలో కొద్దిగా పెరుగు (yogurt) వేసి పేస్టులా చేసి ముఖానికి అప్లై చేసి ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి. దీనిని క్లీన్ చేశాక ముఖానికి మాయిశ్చరైజర్ రాయడం మంచిది. ఇలా తరచూ చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. పెరుగు, నిమ్మరసం రెండు కూడా మంచి టోనర్‌గా పనిచేస్తాయి. అందుకోసం ముందుగా పెరుగులో కాస్తా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కాటన్ ప్యాడ్‌ని వేయాలి. ఈ మిశ్రమాన్ని చర్మంపై రాయాలి. దీనిని స్కిన్‌కి రాయడం వల్ల పోషకాలు తిరిగి అందుతాయి. ఇది చర్మ పీహెచ్ బ్యాలెన్స్‌ కి కూడా చాలా మంచిది. ఈ అడ్డుపడే రంధ్రాలను అన్‌లాగ్ చేయడానికి, ఆర్థ్రీకరణను పెంచడానికి కూడా మంచిది. అలాగే పెరుగు, తేనెతో మాస్క్ తయారు చేసుకోవడం కూడా ఈజీ. ఇందుకోసం ఒక టీ స్పూన్ పెరుగులో టీ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి.

దీన్ని పేస్టులా చేయాలి. ఆ తర్వాత ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడగాలి. తేనె చర్మానికి మేలు చేస్తుంది. పెరుగు, ఓట్స్.. ఓట్స్ మంచి ఎక్స్‌ఫోలియేటర్. చర్మంలోని మురికిని తొలగించేందుకు బాగా పనిచేస్తుంది. దీనిని స్క్రబ్‌లా చేసేందుకు ఓ గిన్నెలో కొంచెం పెరుగు, ఓట్స్ తీసుకోండి. రెండింటిని బాగా కలిపి ముఖం, బాడీకి అప్లై చేయండి. ఈ పేస్టుతో ముఖాన్ని, బాడీని స్క్రబ్ చేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.. ఇలా పైన చెప్పిన రెమిడిలను తరచుగా పాటిస్తూ ఉండడం వల్ల మెరిసే చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.

Also Read:  Beauty Care: వాయు కాలుష్యం నుంచి చర్మం జుట్టును సంరక్షించుకోవాలంటే ఇలా చేయాల్సిందే?