Sitting Time: గంటల తరబడి కూర్చోడం మానేయండి…లేదంటే ముప్పు తప్పదు..!!

మానవశరీరానికి కదలికలు అనేవి చాలా అవసరం.

Published By: HashtagU Telugu Desk
Sitting Time

Sitting Time

మానవశరీరానికి కదలికలు అనేవి చాలా అవసరం. శారీరక కదలికలు లేని లైఫ్ స్టైల్ తో ఆరోగ్యానికి ఎంతో ముప్పు వాటిల్లుతుందని కొంతమందికే తెలుసు. అందుకని శరీరానికి తగినంత కదలికలు ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయని..జర్నల్ ఆఫ్ సైన్స్ అండ్ మెడిసిన్ లో ప్రచురితమైన తాజా అధ్యయనం వెల్లడించింది.

నిశ్చలమైన జీవనాన్ని రోజులో గంట తగ్గించినా ఎంతో కొంత ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ఈ అధ్యయనంలో తేలింది. గుండె ఆరోగ్యం, టైప్ -డయాబెటిస్ ముప్పు తగ్గే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. పరిశోధకులు ఫిన్లాడ్ లో మధ్య వయస్సులో నిశ్చిలమైన జీవనాన్ని గడుపుతున్న 64మందిని సెలక్ట్ చేశారు. వారిని రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపులోని వారికి రోజు గంటపాటు కదలికలు ఉండేలా చూశారు. నిల్చోవడం, అటు ఇటు కదలడం, స్వల్ప వ్యాయామాల్లాంటివి వారితో చేయించారు. మూడు నెలలపాటు పరిశీలించారు. రక్తపోటు, రక్తలో గ్లూకోజును చెక్ చేశారు. స్థిరంగా కూర్చున్నవారితో పోలిస్తే..కనీసం గంటపాటు శారీరకంగా శ్రమించే వారికి బ్లడ్ షుగర్ కంట్రోల్, ఇన్సులిన్ సెన్సిటివిటీ, లివర్ ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు తెలుసుకున్నారు.

ఇక శారీరకంగా తగినంతగా కదల్లేనివారు..అలాగే ఉన్నట్లయితే…ముప్పు తెచ్చుకోవడం ఎందుకు…వీలైనంత సమయం నడవడం, కసరత్తులు చేయడం వంటి చేయాలి. వీలైనంత వరకు శరీరానికి కదలికలు ఉండేలా చూసుకుంటే మంచిది.

  Last Updated: 14 May 2022, 03:15 PM IST