Hardik Pandya : పాకిస్థాన్ ను సిక్సులతో చిత్తు చేసిన హార్ధిక్ పాండ్యా ఫిట్ నెస్ కోసం రోజు చేసే పని ఇదే..!!

హార్దిక్ పాండ్యా...భారత క్రికెట్ ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ పై ఆడిన తీరు అందర్నీ ఆకట్టుకుంది.

  • Written By:
  • Publish Date - August 30, 2022 / 07:30 AM IST

హార్దిక్ పాండ్యా…భారత క్రికెట్ ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ పై ఆడిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. భారత్ ఆసియ కప్ గెలవడంలో హార్ధిక పాండ్యా ముఖ్యమైన పాత్ర పోషించాడు. హార్థిక్ విన్నింగ్ షాట్స్ తో దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. డ్యాన్సులు చేస్తూ క్రికెట్ అభిమానులు సంబురాలు జరుపుకున్నారు. ఇంతకుముందు పాండ్యా కెప్టెన్సీలో ఐపీఎల్ 2022 గుజరాత్ టైటాన్ గెలుచుకుంది. దీని తర్వాత నెదర్లాండ్స్ లో హార్థిక పాండ్యా కెప్టెన్సీలో సిరీస్ కైవసం చేసుకుంది.

ఇప్పుడు పాకిస్తాన్ పై హార్థిక్ ఆటతీరు అందర్నీ ఆకట్టుకుంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన యంగ్ బ్యాట్స్ మెన్…బౌలింగ్, బ్యాటింగ్ లోనూ రాణించాడు. దీనికోసం ఇప్పుడు ఫిట్ గా ఉండేందుకు సమతుల్య ఆహారం తీసుకుంటున్నాడు. హార్థిక పాండ్యా డైట్, ఫిట్ నెస్ వర్కౌట్ గురించి తెలుసుకుందాం.

హార్ధిక్ పాండ్యా…నిపుణుల ఆధ్వర్యంలో వర్కౌట్స్ చేస్తుంటాడు. ఎక్కువగా వార్మప్ వ్యాయామాలను ఇష్టపడుతాడు.శరీరంలో అన్ని భాగాలు సరిగ్గా పనిచేయడానికి ప్రతిరోజూ డ్రిల్ చేస్తాడు. అల్పాహారంలో ప్రొటీన్ కోసం ఉడికించిన గుడ్లు, చికెన్ వింగ్స్ సోయాబిన్స్ తీసుకుంటాడు. జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం, ఇష్టంగా తింటాడు. అదేసమయంలో అల్పాహారంతోపాటు గ్రీన్ టీ , కాఫీ లేదా జ్యూస్ ఎక్కువగా తాగుతాడు.

ఇక మధ్యాహ్న భోజనంలో రోటి, అన్నం, పెరుగు, కూరగాయలు, పప్పు తీసుకుంటాడు. అదే సమయంలో రాత్రి భోజనలో పప్పు, అన్నం, సలాడ్స్, సూప్, చికెన్ తినేందుకు ఇష్టపడుతుంటాడు. వీటన్నింటితోపాటు ప్రతిరోజూ యోగా, వ్యాయామం తప్పనిసరిగా చేస్తాడు. సమయానికి నిద్రపోవడం, మనస్సు ప్రశాంతంగా ఉండేలా దినచర్యను ప్లాన్ చేసుకుంటాడు.