Hair Growth: జుట్టు ఒత్తుగా, గడ్డిలాగా గుబురుగా పెరగాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?

మామూలుగా అమ్మాయిలు ఒత్తైన దృడమైన జుట్టు కావాలని కోరుకుంటూ ఉంటారు. ఎక్కువ శాతం అమ్మాయిలు నల్లటి పొడవాటి జుట్టునే ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఈ ర

  • Written By:
  • Updated On - February 23, 2024 / 06:34 AM IST

మామూలుగా అమ్మాయిలు ఒత్తైన దృడమైన జుట్టు కావాలని కోరుకుంటూ ఉంటారు. ఎక్కువ శాతం అమ్మాయిలు నల్లటి పొడవాటి జుట్టునే ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో అనేక రకాల కారణాల వల్ల చుండ్రు, హెయిర్ ఫాల్ వంటి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే నల్లటి పొడవైన ఒత్తైనా జుట్టు కోసం ఎన్నో రకాల హెయిర్ ఆయిల్స్, బ్యూటీ ప్రోడక్ట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఎన్ని చేసిన కూడా జుట్టు సరిగా పెరగదు. మరి అలాంటప్పుడు ఏమి చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీరు తీసుకునే ఆహారం కూడా దీని పై ప్రభావం చూపిస్తుందని ప్రతి ఒక్కరు గమనించాలి.

మంచి ప్రోటీన్స్ ఉండే ఆహారం అంటే నట్స్, సీడ్స్ వంటివి తీసుకుంటూ ఉండాలి. అదే విధంగా విటమిన్-సి కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఉసిరి వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. కురులు కూడా ఎంతో అందంగా మెరుస్తాయి. ఉసిరి వల్ల జుట్టు తెల్లబడటం ఉండదు అలానే తీసుకొనే డైట్‌లో ఐరన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే డైట్‌లో ఎక్కువగా నువ్వులు, బచ్చలి కూర, మెంతి కూర వంటివి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అలానే జుట్టు ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మంచివి. బృంగరాజ్ జుట్టుకి ఎంతో మేలు చేస్తుంది. ఇది నిజంగా కురులకి ఎంతో మేలు చేస్తుంది. బృంగరాజ్ వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

అలానే దృఢంగా మరియు సాఫ్ట్ గా ఉంటుంది. మీరు తలకి పట్టించే నూనెలో వేప, కరివేపాకు, మందారం వంటివి ఉపయోగించడం మంచిది. పైగా వీటి వలన ఏ సమస్య కూడా వుండదు. బ్రహ్మి మీ జుట్టుని అందంగా మరియు మెరిసే లాగ చేస్తుంది. ఇంట్లోనే మీరు సులువుగా ఈ ఆయిల్స్‌ని తయారు చేసుకుని వాడవచ్చు. ఒత్తిడి కారణంగా కూడా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. కాబట్టి ఒత్తిడి లేకుండా ఆనందమైన జీవితాన్ని గడపడం, ఎక్కువ సేపు నిద్ర పోవడం లాంటివి చేయడం వల్ల కూడా జుట్టు ఊడిపోకుండా ఉంటుంది.