Site icon HashtagU Telugu

Home Remedies : షుగర్, హై కొలెస్ట్రాల్ తగ్గడానికి హెర్బల్ టీ..! ఇంట్లో ఎలా చేసుకోవాలంటే

Home Remedies

Home Remedies

మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. కానీ, ఎన్ని హెల్దీ ఫుడ్స్ తీసుకున్నా కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో హై కొలెస్ట్రాల్, డయాబెటిస్ వంటి సమస్యలు ముఖ్యమైనవి. ఈ రెండు సమస్యలతో నేటి కాలంలో చాలా మంది బాధపడుతున్నారు. ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల డయాబెటిస్, తిని ఎలాంటి వర్కౌట్స్ చేయకపోవడం వల్ల షుగర్ లాంటి సమస్యలొస్తున్నాయి. వీటికి నేచురల్‌గానే ఎలా చెక్ పెట్టాలో తెలుసుకోండి.

ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా సరైన ఫుడ్స్ తినడం, తిన్న ఆహారాన్ని అరిగించడం కష్టంగా మారింది. దీని వల్ల చాలా సమస్యలొస్తున్నాయి. ఇందులో ఎక్కువగా షుగర్ లెవల్స్ పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం కూడా ఉంది. ఇవి ఒక్కసారి వచ్చి మన బాడీలో చేరాలంటే చాలా సమస్యలొస్తాయి. వీటిని తగ్గించుకునేందుకు మెడిసిన్ వాడుతుంటారు. అలా కాకుండా నేచురల్‌గానే సమస్యని తగ్గించుకునేందుకు మనం కొన్ని హెర్బల్ డ్రింక్స్ హెల్ప్ చేస్తాయి. అలాంటి డ్రింక్స్ గురించి న్యూట్రిషనిస్ట్ శ్వేతా చెబుతున్నారు. అవేంటో తెలుసుకోండి.

షుగర్‌ని తగ్గించే హెర్బల్ టీలు

ముందుగా మెంతుల నీరు గురించి తెలుసుకుందాం. మెంతులు షుగర్ ఉన్నవారికి అద్భుతమైన ఆహారం అని చెప్పొచ్చు. వీటిని మనం ఏ రకంగా తీసుకున్నా బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. భోజనం చేశాక షుగర్ లెవల్స్ పెరగకుండా కంట్రోల్ చేస్తాయి. దీనికోసం మెంతుల్ని నానబెట్టి తీసుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు ఓ టీస్పూన్ మెంతుల్ని నీటిలో నానబెట్టండి. ఉదయాన్నే ఆ నీటిని తాగండి. ఇష్టమనుకుంటే మెంతుల్ని నమిలి మింగొచ్చు. ఇలా చేయడం వల్ల చాలా వరకూ బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి.

ఉసిరి నీరు కూడా

ఉసిరిలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేయడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు కిడ్నీల పనితీరుని మెరుగ్గా మారుస్తుంది. ఉసిరి నీటిని తాగడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గతుంది. ఇందులోని ఫైబర్ బ్లడ్ షుగర్ లెవల్స్ పెరగకుండా హెల్ప్ చేస్తాయి. ఇందులోని పాలీఫెనాల్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఇందులోని క్రోమియం, మినరల్ కూడా మెటబాలిజాన్ని మెరుగ్గా చేసి బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది.

కొలెస్ట్రాల్‌ని తగ్గించే టీలు

గోరువెచ్చని నీటిలో నిమ్మరసంగోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. లివర్ మెటబాలిజం సరిగ్గా మారేలా చేస్తుంది. నిమ్మలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ కారణంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. ఈ నీటిని రెగ్యులర్‌గా మన డైట్‌లో యాడ్ చేస్తే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అసిడిటీ కూడా దూరమవుతుంది.

గ్రీన్ టీ తాగితే బెనిఫిట్స్

గ్రీన్ టీ తాగడం వల్ల బాడీలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కానీ, తగిన మోతాదులో తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోవద్దు. ఇది బాడీ, బ్లడ్‌లో పేరుకుపోయిన కొవ్వుని తొలగిస్తుంది. దీని వల్ల మంచి కొలెస్ట్రాల్‌పై ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. అంతకాకుండా బాడీలోని ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించి ఫ్యాట్ పెరగకుండా చేస్తుంది.

హార్మోనల్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్‌ కోసం టీ

అదే విధంగా, హార్మోనల్ ప్రాబ్లమ్స్ కారణంగా వచ్చే థైరాయిడ్ వంటి సమస్యల్ని తగ్గించేందుకు కూడా మంచి పరిష్కారాలు ఉన్నాయి. అందులో హైపో థైరాయిడ్ సమస్య తగ్గేందుకు జీలకర్ర నీరు హెల్ప్ చేస్తుంది. దీని వల్ల మెటబాలిజం పెరుగుతుంది. బ్లోటింగ్ తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది.

PCOS, PCOD తగ్గేందుకు

PCOS తగ్గడానికి దాల్చిన చెక్క నీరు హెల్ప్ చేస్తుంది. దీని వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఆండ్రోజెన్ లెవల్స్ తగ్గేలా చేస్తాయి. మెనుస్ట్రువల్ ప్రాబ్లమ్స్ దూరమవుతాయి. వీటితో పాటు స్పియర్‌మింట్ టీ తీసుకుంటే ఆండ్రోజెన్ లెవల్స్ తగ్గుతాయి. ఫేషియల్ హెయిర్ తగ్గుతుంది. హార్మోనల్ బ్యాలెన్స్ మెరుగ్గా మారుతుంది.

 

Exit mobile version