Healthy Skin: అందం కోసం వీటిని ముఖంపై నేరుగా అప్లై చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

సాధారణంగా అమ్మాయిలు, అబ్బాయిలు అందంగా కనిపించాలని కోరుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా అమ్మాయిలు

  • Written By:
  • Publish Date - November 27, 2022 / 08:00 AM IST

సాధారణంగా అమ్మాయిలు, అబ్బాయిలు అందంగా కనిపించాలని కోరుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా అమ్మాయిలు అయితే వారి అందం విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ఫేస్ మీద చిన్నచిన్న పింపుల్స్ వచ్చినా సరే వెంటనే భయపడి పోయి మార్కెట్లో దొరికే అనేక రకాల ప్రోడక్ట్స్ ని వినియోగిస్తూ ఉంటారు. కొంతమంది మార్కెట్లో దొరికే ఖరీదైన కాస్మోటిక్స్ ను ఉపయోగిస్తూ కొన్ని రకాల ఆయుర్వేద హోమ్ చిట్కాలను కూడా పాటిస్తూ ఉంటారు. అయితే అందం విషయంలో వంటింటి చిట్కాలను పాటించడం మంచిదే కానీ కొన్నింటిని నేరుగా ముఖం మీద అప్లై చేయకూడదు. మరి ముఖం మీద ఎటువంటివి నేరుగా అప్లై చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నిమ్మకాయను ఎప్పుడు నేరుగా ముఖానికి అప్లై చేయకూడదు. నిమ్మకాయలో అధిక మొత్తంలో ఆమ్లం ఉంటుంది. సున్నితమైన చర్మం ఉన్నవారు నిమ్మకాయను అస్సలు ఉపయోగించకూడదు. అలాగే చాలామంది ఆవ నూనె ను ముఖానికి అప్లై చేస్తూ మర్దన చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ముఖం నల్లగా మారుతుంది. అలాగే బేకింగ్ సోడా ని కూడా నేరుగా ముఖం మీద అప్లై చేయకూడదు. అలా బేకింగ్ సోడాను ముఖం మీద నేరుగా అప్లై చేయడం వల్ల మొటిమలు మొటిమల సమస్య మరింత ఎక్కువ అవుతుంది. అలాగే టూత్ పేస్ట్ బ్లాక్ హెడ్స్ మొటిమలు తగ్గిస్తుంది. కానీ టూత్ పేస్ట్ ని మాత్రం ముఖానికి నేరుగా అప్లై చేయకూడదు. మొటిమలపై టూత్ పేస్ట్ ను ఉపయోగించడం వల్ల అవి ఎర్రగా మారుతాయి.

టూత్ పేస్ట్ లో మీ చర్మాన్ని దెబ్బతీసే లక్షణాలే దీనికి కారణం. చాలామంది స్క్రబ్ లను తయారు చేసుకోవడానికి ఉప్పు అలాగే చక్కెరను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఉప్పు చక్కెరను నేరుగా ముఖం మీద అప్లై చేయడం వల్ల చర్మం మరింత పొడిగా మారుతుంది. క్రమంగా అది అంటూ వ్యాధులకు కూడా దారితీస్తుంది. చాలామంది ముఖం మీద మొటిమలను తగ్గించుకోవడానికి వెల్లుల్లి ని డైరెక్టుగా ముఖంపై అప్లై చేస్తూ ఉంటారు. వెల్లుల్లిలో ఎక్కువ మొత్తం ఆమ్లం ఉంటుంది. వెల్లుల్లి ముఖంపై దద్దుర్ల పై నేరుగా అప్లై చేయడం వల్ల చికాకు కలుగుతుంది.