Site icon HashtagU Telugu

Oats Uthappam: ఎప్పుడైనా ఓట్స్ ఊతప్పం తిన్నారా.. అయితే ఇలా తయారు చేసుకోండి?

Oats Uthappam

Oats Uthappam

ప్రతిరోజు మనం ఉదయం సమయంలో ఇడ్లి, దోస, పూరి, పొంగల్, దోసలోనే ఊతప్పం, మసాలా దోశ ఆనియన్ దోశ ఇలా రకరకాలుగా టిఫిన్లు తింటూ ఉంటాం.. అయితే ఎప్పుడూ ఒకే రకమైన టిఫిన్లు కాకుండా అప్పుడప్పుడు కాస్త భిన్నంగా తినాలని చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. కానీ కొత్త రకం టిఫిన్ లు ఎలా చేయాలి అన్నది చాలా మందికి తెలియక, ఏం చేయాలా అని తెగ ఆలోచిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు వింత వింతగా ట్రై చేసి ఫెయిల్ అవ్వడం వల్ల బాధపడుతూ ఉంటారు. అటువంటి వారి కోసం ఈ చక్కటి రెసిపీ. ఉదయాన్న హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ ఓట్స్‌ ఊతప్పం ని ట్రై చేయండి. అయితే మరి ఈ ఓట్స్ ఊతప్పం కోసం, ఎటువంటి ఆహార పదార్థాలు కావాలి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఓట్స్‌ ఊతప్పం కావలసిన పదార్థాలు :

ఓట్స్‌ – అరకప్పు
బియ్యప్పిండి – పావు కప్పు
పెరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
ఉల్లిపాయ ముక్కలు – రెండు టేబుల్‌ స్పూన్లు
క్యారట్‌ ముక్కలు – రెండు టేబుల్‌ స్పూన్లు
టొమాటో తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు
పచ్చిమిర్చి తరుగు – రెండేసి టేబుల్‌ స్పూన్లు
కొత్తిమీర తరుగు – రెండేసి టేబుల్‌ స్పూన్లు

తయారీ విధానం :

ఇందుకోసం ముందుగా ఓట్స్‌ను మిక్సీజార్‌లో వేసి పొడి చేసుకోవాలి. తరువాత ఓట్స్‌ పొడిలో ఉప్పు, పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి గరిటజారుగా కలుపుకోవాలి. ఆపై పాన్‌పై నూనె వేసి పిండిని మరీ పలుచగా కాకుండా, మందంగా కాకుండా మీడియం దోసెలా వేసుకోవాలి. ఇప్పుడు క్యారట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, కొత్తిమీర తరుగుని ఒకగిన్నెలో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఊతప్పం ఒకవైపు కాలిన తరువాత క్యారెట్‌ ముక్కల మిశ్రమాన్ని ఊతప్పం మొత్తం చల్లుకుని రెండో వైపు కూడా చక్కగా కాల్చుకోవాలి. పిండిమొత్తాన్ని ఇదే విధంగా వేసుకుని ఏదైనా చట్నీతో సర్వ్‌ చేసుకోవాలి. అంతే టేస్టీగా ఉండే ఓట్స్ ఊతప్పం రెడీ.