Pregnant Women and Coffee: గర్భవతులు కాఫీ అస్సలు తాగకూడదు.. ఎందుకంటే?

ప్రస్తుత జనరేషన్ లో ఉదయం లేవగానే కాఫీ లేదా టీ కచ్చితంగా ఉండాల్సిందే. లేదంటే ఆ రోజంతా కూడా ఇలాగే

Published By: HashtagU Telugu Desk
Health Tips

Health Tips

ప్రస్తుత జనరేషన్ లో ఉదయం లేవగానే కాఫీ లేదా టీ కచ్చితంగా ఉండాల్సిందే. లేదంటే ఆ రోజంతా కూడా ఇలాగే ఉంటుంది. అయితే ఈ కాఫీ, టీలు చాలామంది ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఇక ఉద్యోగాలు చేసే వాళ్ళు అయితే అలా స్నేహితులతో బయటకు వెళ్లినప్పుడు లేదంటే ఆఫీసుల్లో టీ టైం అప్పుడు ఎక్కువగా తాగుతూ ఉంటారు. అదేవిధంగా ఇంట్లో ఉంటే కూడా ప్రతిరోజు ఉదయం అలాగే సాయంత్రం కూడా టీ, కాఫీ ఉండాల్సిందే. చాలామందికి రోజుల్లో ఒక్కసారైనా టీ తాగకపోతే అసలు గడవదు. అలా టీ కాఫీలు అన్నవి మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి.

అయితే ఈ టీ కాఫీలను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల రకాల సమస్యలు తలెత్తుతాయి. ఇకపోతే మరి కాఫీలు టీలు అన్నది సాధారణ వ్యక్తులు కాకుండా గర్భవతిగా ఉన్న మహిళలు తాగవచ్చా? ఒకవేళ తాగితే ఎటువంటి ప్రమాదాలు వస్తాయ? ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గర్భవతులు లేదా తల్లిపాలు ఇస్తున్న వారు కాఫీకి దూరంగా ఉండాలట. ఒకవేళ గర్భవతిగా ఉన్నవారు కాపీలు, టీలు తాగితే 200 మిల్లీ లీటర్ల కంటే ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే పాలిచ్చే తల్లులు కాఫీ తాగడం వల్ల డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల వీరు పాలిచ్చే రోజుల్లో కాఫీ మానటం ఉత్తమం. అలాగే మెటబాలిజమ్‌ స్లోగా ఉన్నవారు కాఫీకి దూరంగా ఉండటం మంచిది. అయితే కొంతమంది వ్యక్తులలో కాఫీ ఆందోళనను తీవ్రతరం చేస్తుంది. అందువల్ల, తరచు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నవారు ఈ కాఫీ తాగడం మానేయాలి లేదా తగ్గించాలి.

  Last Updated: 13 Aug 2022, 11:35 PM IST