Health Tips : పులిపిర్లు ఎక్కువగా ఉన్నాయా.. అయితే ఒకసారి ఇది రాస్తే చాలు.. రాత్రికి రాత్రే పులిపిర్లు మాయం అవ్వాల్సిందే?

Health Tips : మనలో చాలామందికి ఈ పులిపిర్లు వైరస్ వల్ల వస్తాయి అన్న విషయం తెలియదు. చర్మ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ పులిపిర్లు వస్తూ ఉంటాయి.

  • Written By:
  • Publish Date - December 8, 2023 / 06:00 PM IST

Health Tips : మామూలుగా మనకు పులిపిర్లు రావడం అన్నది సహజం. ఈ పులిపిర్లు మనకు ఎక్కువగా మెడ, వీపు భాగంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొందరికి ముఖంపై కూడా ఈ పులిపిర్లు వస్తూ ఉంటాయి. అయితే ఒకటి రెండు వస్తే పర్లేదు కానీ చాలామందికి ఈ పులిపిర్లు ఎక్కువగా వచ్చి ముఖం అందవిహీనంగా కనిపిస్తూ ఉంటుంది. కొందరికి మెడ భాగం మొత్తం ఈ పులిపిర్లు రావడంతో ఇబ్బంది పడుతూ నలుగురిలోకి వెళ్లాలి అన్న కూడా ఏదోలా ఫీలవుతూ ఉంటారు. అయితే మనలో చాలామందికి ఈ పులిపిర్లు వైరస్ వల్ల వస్తాయి అన్న విషయం తెలియదు. చర్మ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ పులిపిర్లు వస్తూ ఉంటాయి. హ్యూమన్ పాపిలోమా ఇది చర్మం మీద దెబ్బలు లేదా మొటిమలు వచ్చినప్పుడు ఆ సందులోంచి చర్మం లోనికి ప్రవేశిస్తుంది.

We’re Now on WhatsApp. Click to Join.

అక్కడ వైరస్ తిష్ట వేసుకుని కూర్చుని అదనపు కణాలు ఒకే చోట పెరిగేలా చేస్తుంది. ఆ కడాలన్నీ చర్మం బయటకు పులిపిర్లు పెరగకుండా సహజ సిద్ధంగా తగ్గిపోతాయి. చిన్న కాటన్ బాల్ ని తీసుకుని ఆపిల్ సైడర్ వెనిగర్లో ముంచి పులిపిర్లపై ఉంచితే పులిపిర్లు తగ్గిపోతాయి. వారంలో కనీసం ఐదు రోజులైనా ఇలా చేస్తే పులిపిర్లు మాయమైపోతాయి. అలాగే బేకింగ్ పౌడర్ కూడా పులిపిర్లను చక్కగా తగ్గిస్తాయి. దీనికి ఎం చేయాలంటే ఆముదంలో కాస్త బేకింగ్ పౌడర్ వేసి బాగా కలిపి, ఇలా కలిపిన మిశ్రమాన్ని పులిపిర్లకు అప్లై చేసి బ్యాండేజ్ వేసి కట్టు కట్టేయాలి. ఇలా కట్టు కట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. ఇలా మూడు రోజులు పాటు క్రమం తప్పకుండా చేస్తే పులిపిర్లు పూర్తిగా తగ్గిపోతాయి. కలబంద ఇందులో ఉండే మాలిక్ ఆసిడ్ పులిపిర్లలో ఉండే ఇన్ఫెక్షన్తో పోరాడుతుంది.

కలబంద లోపలి గుజ్జును పులిపిర్లకు అప్లై చేస్తే చాలు చక్కగా తగ్గిపోతాయి. అరటిపండు తొక్క కూడా పులిపిర్లను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఎంజైలు చర్మానికి మేలు చేస్తాయి. పులి పర్లపై అరటిపండు తొక్కతో రుద్దితే పులిపిర్లు పూర్తిగా తొలగిపోతాయి. వీటిని అప్లై చేయడంతో పాటుగా పులిపిర్లు రాకుండా ఉండాలి అంటే ఆహారంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగే ఆహారాన్ని తీసుకోవాలి. చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. అందుకు తగినంత నీరు తాగాలి. తగినంత నీరు తాగుతూ ఉంటే మన చర్మం కాంతి వంతంగా ఉండి తేమగా ఆరోగ్యంగా ఉంటుంది.

Also Read:  Hibiscus: అలాంటి సమస్యలు మిమ్మల్ని వేదిస్తున్నాయా.. అయితే మందారాలతో ఈ పరిహారం చేయాల్సిందే?