‎Dates Benefits: ఏంటి.. మగవారు ఖర్జూరాలు తినడం వల్ల ఏకంగా ఇన్ని లాభాలా?

Dates Benefits: మగవారు ఖర్జూరాలు తినడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని, వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు నమ్మలేరు అని చెబుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Dates Benefits

Dates Benefits

Dates Benefits: ఖర్జూరాల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే కొందరు డ్రై ఖర్జూరాలు తినడానికి ఇష్టపడితే మరి కొందరు మామూలు ఖర్జూరాలను తింటూ ఉంటారు. ఈ రెండింటి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కాగా ఖర్జూరాల్లోని పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు రక్తపోటును నియంత్రించడంలో, కొలెస్ట్రాల్‌ ను తగ్గించడంలో సహాయపడతాయి.

‎తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు. కాగా ఖర్జూరాలలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. జీర్ణక్రియకు, మలబద్ధకాన్ని నివారించడానికి ఫైబర్ చాలా అవసరం. అదనంగా వాటిలోని ఫైబర్ రక్తంలో చక్కెర నియంత్రణకు ప్రయోజనకరంగా ఉంటుందట. ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగాట్టి ఉంటాయని కాబట్టి అవి రోగనిరోధక శక్తిని, గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి మేలు చేస్తాయని చెబుతున్నారు. గర్భధారణ చివరి వారాల్లో ఖర్జూరం తినడం వల్ల గర్భాశయ విస్తరణను ప్రోత్సహించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

‎ కాగా ఇందులో ఫ్రక్టోజ్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి చక్కెరకు ప్రత్యామ్నాయంగా వీటిని ఉపయోగించవచ్చు. దీనికి అనేక పోషక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఇందులో కేలరీలు అధికంగా ఉంటాయట. వాటిలో భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం వంటి అనేక ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయని చెబుతున్నారు. ఖర్జూరాలు మగవారికి పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, శక్తిని పెంచడం, గుండె ఆరోగ్యాన్ని కాపాడటం వంటి అనేక లాభాలను అందిస్తాయని చెబుతున్నారు. అలాగే ఖర్జూరాలలో ఉండే పోషకాలు స్పెర్మ్ కౌంట్‌ ను పెంచడంలో సహాయపడతాయట. ఖర్జూరాలలో ఉండే అమైనో ఆమ్లాలు, కొన్ని హార్మోన్లు మగవారిలో లిబిడోను పెంచడంలో స్పెర్మ్ కౌంట్‌ను మెరుగుపరచడంలో సహాయపడతాయట.

  Last Updated: 27 Oct 2025, 08:23 AM IST