Health Benefits: ఇవి రెండు కలిపి రాస్తే చాలు.. ఎలాంటి పిలుపుర్లు అయినా రాలిపోవాల్సిందే?

మాములుగా చాలామంది పులిపిర్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ పులిపిర్లు తగ్గించు కోవడానికి ఎన్నో రకాల చిట్కాలను పాటిస్తూ ఉంటారు. కాగా ఈ పులిపి

  • Written By:
  • Publish Date - January 10, 2024 / 07:32 PM IST

మాములుగా చాలామంది పులిపిర్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ పులిపిర్లు తగ్గించు కోవడానికి ఎన్నో రకాల చిట్కాలను పాటిస్తూ ఉంటారు. కాగా ఈ పులిపిర్లు ఎక్కువగా ముఖం, మెడ,చేతులు, పాదాల భాగంలో వస్తూ ఉంటాయి. కాగా రోగనిరోధక శక్తి త‌గ్గిన‌ప్పుడు, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినప్పుడు కొన్ని రకాల వైరస్‌లు అటాక్ చేస్తాయి. దీంతో పులిపిర్లు ఏర్పడతాయి. అయితే చాలామంది పులిపిర్లను కత్తిరించటం, కాల్చటం వంటివి చేయకూడదు. ఇవి ఎక్కువగా రాపిడిగా ఉండే ప్రాంతాల్లోనే ఏర్పడతాయి. కాగా కొన్ని స‌హ‌జ చిట్కాలు పాటించి వీటిని మాయం చేయవచ్చు.

మరి అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చర్మ వ్యాధుల నివారణకు వెల్లులి మంచి ఔషదంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఎల్లిసిన్ ఫంగస్, వైరస్ వంటి బ్యాక్టీరియాలతో పోరాడుతుంది. అలాగే పులిపిర్లను తొలగించడంలో ఇది అత్యుత్తమంగా పనిచేస్తుంది. ఇందుకు మీరు వెల్లులి ముద్దగా చేసుకుని పులిపిర్లు ఉన్నచోట రాసి ఒక గంట ఆర‌నివ్వాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే పులిపిర్లు రాలిపోతాయి. దీంతో ఎలాంటి స‌మ‌స్య‌లు, సైడ్ ఎఫెక్టులు ఉండ‌వు. కాబట్టి పులిపుర్లు ఉన్న‌ ప్రతి ఒక్కరు ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. ఆముదంలో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలి. తరవాత ఆ మిశ్ర‌మాన్ని పులిపిర్లపై రాసి బ్యాండేజ్ వేసి రాత్రంతా ఉంచాలి. ఇలా మూడు రోజులు చేస్తే పులిపిర్లు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఉల్లిపాయ‌ల్లో సల్ఫ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. ఈ ఉల్లిపాయ‌ల‌ను పొట్టుతీసీ మిక్సిలో వేసి మెత్త‌గా పెస్ట్ చేసుకోవాలి.

త‌ర్వాత ఫిల్ట‌ర్ చేసి ర‌సాన్ని తీయాలి. ఈ ర‌సంలో కొబ్బ‌రినూనే వేసి బాగా క‌ల‌పాలి. త‌ర్వాత దూదితో పులిపిర్ల‌పై పూయాలి. ఆ త‌ర్వాత బ్యాండేజ్ వేసి నైట్ అంతా ఉంచాలి. ఇలా రెగ్యూల‌ర్ గా చేస్తే పులిపిర్లు రాలిపోతాయి. అలాగే క‌ల‌బందలో ఉండే మేలిక్ యాసిడ్ పులిపిర్లలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. కలబంద ఆకు మధ్యలో ఉండే జిగురును తీసుకుని పులిపిర్లపై రాస్తే పులిపిర్లు రాలిపోతాయి.