Sleeping: కాకుండా బెడ్‌పై నిద్రిస్తున్నారా.. అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే?

అప్పట్లో పడుకోవాలి అంటే నులక మంచం లేదా పట్టి మంచాలు లేదంటే ఆరుబయట చాప వేసుకుని నేల పై పడుకుని నిద్రించేవారు. నులక మంచం,పట్టే మంచాల పై పడుకున్న నేలపై నిద్రించినా పెద్దగా తేడా లేకపోయేది. కానీ రాను రాను టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో

  • Written By:
  • Publish Date - October 1, 2022 / 09:10 AM IST

అప్పట్లో పడుకోవాలి అంటే నులక మంచం లేదా పట్టి మంచాలు లేదంటే ఆరుబయట చాప వేసుకుని నేల పై పడుకుని నిద్రించేవారు. నులక మంచం,పట్టే మంచాల పై పడుకున్న నేలపై నిద్రించినా పెద్దగా తేడా లేకపోయేది. కానీ రాను రాను టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో ప్రతి ఇంట్లో కూడా అత్యధిక మెత్తటి పరుపులు, దిండ్లు రావడంతో మనుషులు పూర్తిగా వీటికి అలవాటు పడిపోయారు. ఇంకా ఎంతలా మారిపోయారు అంటే పడుకునే సమయంలో పరుపు లేకపోతే నిద్ర పట్టదు అన్న స్థితికి చేరుకున్నారు. పెద్ద పెద్ద సిటీలలో మాత్రమే కాకుండా పల్లెటూర్లలో కూడా ఈ పరుపులను ఉపయోగిస్తున్నారు.

అయితే టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా కూడా ఇప్పటికీ నేలపై చాపలు వేసుకుని పడుకొని నిద్రపోయే వారు చాలామంది ఉన్నారు. అందుకు గల కారణం బెడ్ పై పడుకోవడం కంటే నేలపై పడుకోవడం ఆరోగ్యానికి మంచిది అన్న విషయం తెలుసు కాబట్టి. మరి నేలపై పడుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొన్ని కొన్ని సార్లు మనం మెత్తటి పరుపుపై పడుకున్నా కూడా సరిగా నిద్ర పట్టదు. నిద్రపట్టగా అటువైపుకు ఇటువైపుకు తిరిగి పడుకోవడం లాంటివి చేసినా కూడా నిద్ర పట్టనప్పుడు నేల పై చాప వేసుకుని పడుకోవడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే నేలపై పడుకోవడం అన్నది మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ అలవాటు అవుతున్న కొద్దీ నిద్ర పడుతుంది. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటారు. లేకపోయి పడుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి హెల్త్ కండిషన్ బాగుంటుంది. అదేవిధంగా నేలపై పడుకోవడం వల్ల శరీరాకృతి కూడా మెరుగవుతుంది. అలాగే వెన్ను నొప్పితో బాధపడే వారు నేలపై పడుకోవడం మంచిది అని నిపుణులు చెబుతున్నారు. అలాగే వృద్ధులు కూడా నేలపై పడుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే నడవడానికి ఇబ్బంది పడేవారు ఎముకలలో నొప్పి, వెన్ను నొప్పి లాంటి సమస్యలతో బాధపడేవారు నేలపై పడుకోకూడదు. అలాగే గర్భవతులు గర్భధారణ జరుగుతున్న సమయంలో కూడా నేలపై పడుకోకూడదు. గర్భం కారణంగా ఆ స్త్రీల యొక్క వెన్నెముక కొద్దిగా వంగి ఉంటుంది. కాబట్టి అటువంటి సమయంలో నేలపై పడుకోవడం వల్ల వెన్నునొప్పి వస్తుంది.