Site icon HashtagU Telugu

Health Benefits: మగవారు పటిక బెల్లం తింటే ఆ క్వాలిటీ పెరుగుతుందట?

Mishri

Mishri

పటిక బెల్లం..ఇది మనం చాలా తక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఈ పట్టిక బెల్లం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పటిక బెల్లాన్ని వైద్య ప్రయోజనాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. పటిక బెల్లంలో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, అమినో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మాంసాహారంలో దొరికే ముఖ్యమైన విటమిన్, విటమిన్ బి12 పటిక బెల్లంలో ఎక్కువ మొత్తంలో లభిస్తాయి.

అందుకే ప్రతిరోజు పటిక బెల్లాన్ని ఉపయోగించుకోకుండా అప్పుడప్పుడు వాటికి ప్రత్యమ్యాయంగా పటిక బెల్లాన్ని కూడా ఉపయోగిస్తూ ఉండాలి. పటిక బెల్లం తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. అంతేకాకుండా జీర్ణశక్తిని పెంచి దేహానికి మంచి బలాన్ని ఇస్తుంది. పటిక బెల్లాన్ని నల్ల మిరియాలు పొడి, నెయ్యితో కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. గొంతు నొప్పి నివారణకు రాత్రిపూట దీన్ని తినాలి. ముక్కులోంచి రక్తం వచ్చినప్పుడు వెంటనే పటికబెల్లం కలిపిన నీటిని ఇవ్వడం వల్ల ఉపశమనం లభిస్తుంది. అలాగే పటిక బెల్లం మగవారిలో వీర్యం క్వాలిటీని మెరుగుపరుస్తుంది.

పటికబెల్లం ముక్కను కొద్దిగా నీళ్లతో అరగదీయగా వచ్చిన గంధాన్ని తేలు కుట్టిన చోట రాసి మర్దన చేయడం వల్ల 6 నిమిషాల్లో తేలు విషం హరించబడుతుంది. అలాగే ఎండాకాలంలో పటిక బెల్లం పొడిని నీటిలో వేసుకుని తాగడం వల్ల అతి దాహం అలాగే పాటు వడదెబ్బ కూడా తగలదు. పటిక బెల్లం ను భోజనం చేసిన తర్వాత తింటే నోటి నుండీ వచ్చే ఆ చెడు వాసన పోగొట్టి తాజా శ్వాస నింపుతుంది

Exit mobile version