Site icon HashtagU Telugu

‎Pumpkin Seeds: గుమ్మడి గింజల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

Pumpkin Seeds

Pumpkin Seeds

‎Pumpkin Seeds: గుమ్మడి గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. గుమ్మడి గింజల్లో ఫైబర్, విటమిన్‌ ఏ, బీ, సీ ఈ తో పాటు ఐరన్‌, కాల్షియం, జింక్‌, ఫోలేట్‌, ఫ్యాటీ యాసిడ్స్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం, జింక్, అమైనో యాసిడ్స్‌ ఫినోలిక్‌ సమ్మేళనాలు పుష్కలంగా లభిస్తాయి. కాగా తరచూ గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల అనేక అద్భుతమైన అరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. చాలామంది గుమ్మడికాయతో కొన్ని రకాలు వంటలు తయారు చేసిన తర్వాత గుమ్మడి గింజలు పారేస్తూ ఉంటారు.

‎కానీ గుమ్మడి గింజల వల్ల కూడా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. గుమ్మడి గింజలలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, యాంటీ ఆర్థరైటిక్‌తో పాటు యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. తరచూ గుమ్మడి గింజలు తీసుకోవడం వల్ల అనేక అరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. గుమ్మడి గింజల్లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. అధిక బరువుతో బాధపడేవారు గుమ్మడి గింజలు తింటే మేలు జరుగుతుందని చెబుతున్నారు. రోజూ కొన్ని గుమ్మడి గింజలు తింటే పొట్ట నిండిన ఫీలింగ్‌ ఉంటుంది. దీనితో ఫుడ్‌ క్రేవింగ్‌ తగ్గుతుందట. దీని వల్ల ఎక్కువగా తినకుండా ఉంటారు.

‎ ఫలితంగా బరువు కంట్రోల్‌ లో ఉంటుందట. గుమ్మడి గింజలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గుమ్మడి విత్తనాలలో ఉండే జింక్‌ ఇమ్యూనిటీని పెంచుతుందట. గుమ్మడి గింజల్లోని కెరొటినాయిడ్లు, విటమిన్‌ ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ నుంచి రక్షిస్తాయట. గుమ్మడి గింజలు తరచుగా తీసుకుంటే గ్యాస్ట్రిక్‌, ప్రోస్టేట్, బ్రెస్ట్, లంగ్, పేగు కేన్సర్ల నుంచి రక్షణ లభిస్తుందట. కాగా గుమ్మడి గింజల్లో మెగ్నీషియం మెండుగా ఉంటుంది. మెగ్నీషియం హైపర్‌టెన్షన్‌ కంట్లోల్‌లో ఉంచుతాయట. గుమ్మడి గింజలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయట. గుమ్మడి గింజలు రక్తంపీహెచ్‌ ను క్రమబద్ధం చేస్తాయని, ఒత్తిడిని నివారిస్తాయని చెబుతున్నారు. షుగర్‌ పేషెంట్స్‌కు గుమ్మడి గింజలు మేలు చేస్తాయని చెబుతున్నారు. గుమ్మడి గింజల్లో యాంటీ డయాబెటిక్‌ లక్షణాలు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌ లో ఉంచుతాయట. గుమ్మడికాయ విత్తనాలలో ట్రైగోనిలైన్, నికోటినిక్ యాసిడ్, డి కైరో ఐనాసిటాల్ అనే సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయట. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌ లో ఉంచుతాయట.

Exit mobile version