Rain : వానాకాలం(Rainy Season) వచ్చింది కాబట్టి వానలు బాగానే పడ్డాయి, ఇంకా పడతాయి. అయితే వానలు పడినా మన పనుల వలన మనం బయటకు వెళ్ళక తప్పదు. వానలో తడిస్తే మనకు జలుబు, జ్వరం వంటివి వస్తాయి అని అందరూ అనుకుంటారు. చాలా మందికి వానల వలన సీజనల్ వ్యాధులు వస్తాయని భావిస్తారు. కానీ వానలో తడవడం కూడా ఒక రకంగా మన ఆరోగ్యానికి మంచిదే.
వానలో తడవడం వలన వాన నీటిలో ఉండే ఆల్కలీన్ పిఫ్ మన జుట్టు బలంగా ఉండడానికి సహాయపడుతుంది. వాన నీటిలో పలు రకాల ఖనిజాలు ఉంటాయి. అవి మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వర్షపు నీటిలో ఉండే ఖనిజాలు మన చర్మం పైన ఉండే మురికిని, డెడ్ సెల్స్ ని తొలగిస్తాయి. వర్షపు నీటితో మనం స్నానం చేస్తే మన చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది.
వర్షంలో తడుస్తూ చిన్న పిల్లలు సంతోషపడతారు. అలా చేయడం వలన సెరిటోనిన్, ఎండోర్ఫిన్ అనే హార్మోన్లు విడుదల అవుతాయి. మనం కూడా అలా చేయడం వల్ల మనలోని ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి వర్షంలో తడవడం వలన ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గుతాయి. వర్షంలో స్నానం చేయడం వలన మన మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుంది. అలాగే చల్లని వర్షం నీటితో ముఖం కడుక్కుంటే మన ముఖం మెరుస్తుంది.
అలా అని రోజంతా వర్షంలో కూర్చుంటే మాత్రం జలుబు, జ్వరం తప్పవు. వర్షంలో తడవడం ఆరోగ్యానికి మంచిదే కాబట్టి అప్పుడప్పుడు సరదాగా తడవండి.
Also Read : Sravana Masam 2024: శ్రావణమాసంలో సోమ, మంగళ శుక్ర వారాలలో చేయాల్సినవి,చేయకూడని పనులు ఇవే?