Wood Apple: వెలగపండు వల్ల మగవారికి కలిగే లాభాలు తెలిస్తే అస్సలు తినకుండా ఉండలేరు?

వెలగపండు ఈ పండును కొన్ని ప్రదేశాలలో వెలక్కాయ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ వెలగపండు ఎక్కువగా మనకు

  • Written By:
  • Updated On - November 21, 2022 / 12:20 PM IST

వెలగపండు ఈ పండును కొన్ని ప్రదేశాలలో వెలక్కాయ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ వెలగపండు ఎక్కువగా మనకు వినాయక చవితి పండుగకు కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే ఈ వెలక్కాయలు కనిపిస్తూ ఉంటాయి. కాగా ఈ వెలగ పండును తినడం వల్ల శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయం తెలిసిందే. కేవలం వెలగపండు మాత్రమే కాకుండా ఆ చెట్టు యొక్క బెరడు వేర్లు ఆకులు ప్రతి ఒక్కటి కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ వెలగ పండును ఇంగ్లీష్ లో మంకీ ఫ్రూట్, కర్డ్ ఫ్రూట్, ఉడ్ యాపిల్ అని ఇలా పలు రక రకాలుగా పిలుస్తారు.

వీటిలో కాల్షియం, పాస్ఫరస్ ఐరన్, పిండి పదార్ధాలు, నియాసిన్, సిట్రిక్ ఆమ్లంతో పాటు అనేక పోషక పదార్థాలు, క్యాలరీలు సమృద్ధిగా లభిస్తాయి. ఈ వెలగ పండును తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వెలగ పండు తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. వెలగ పండు లో ఉండే గుజ్జు లో జీర్ణశక్తిని మెరుగుపరిచే గుణాలు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారు వెలగ పండును తినడం వల్ల ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే చాలామంది నులిపురుగు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అటువంటివారు వెలగ పండుని తినడం వల్ల అందులో ఉండే పోషకాలు కడుపులో ఉండే పరాన్న జీవులైన నులి పురుగులను చంపేస్తాయి.

అలాగే వెలగ పండు గుజ్జులో కాస్త బెల్లం కలిపి తీసుకోవడం వల్ల పురుషుల్లో నాణ్యమైన వీర్యం కలుగుతుంది. అదేవిధంగా లైంగిక సమస్యలను కూడా తగ్గిస్తుంది. కాబట్టి మగవారు వెలగపండును ఎక్కువగా తినడం వల్ల శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనవచ్చు. అలాగే ఈ వెలగపండును తీసుకుంటే రక్తహీనత, గుండె జబ్బులు, కంటి సమస్యలు, మూత్ర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.