Site icon HashtagU Telugu

Ash Gourd: బూడిద గుమ్మడికాయతో ఇన్ని సమస్యలకు చెక్ పెట్టొచ్చా..?

Ash

Ash

Ash Gourd: బూడిద గుమ్మడికాయ పేరు వినగానే.. చాలామంది దిష్టి తీయడానికి నరదృష్టి పోవడానికి తంత్రాలకు మంత్రాలకు ఉపయోగిస్తారు అని అనుకుంటూ ఉంటారు. కేవలం వాటికి మాత్రమే కాకుండా బూడిద గుమ్మకాయను ఉపయోగించి ఎన్నో రకాల వంటలు కూడా చేస్తారు. అంతే కాకుండా బూడిద గుమ్మడికాయ అయినా తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కూరగాయలు ఎన్ని నెలలు అయినా కూడా పాడవకుండా ఉండే కూరగాయ ఏదైనా ఉంది అంటే అది బూడిద గుమ్మడికాయ అని చెప్పవచ్చు. గుమ్మడికాయ రుచి అచ్చం దోసకాయ రుచి లాగే ఉంటుంది.

భారత్ తరవాత చైనా దేశంలో ఈ బూడిద గుమ్మడికాయని ఎక్కువగా వినియోగిస్తారు. బూడిద గుమ్మడికాయలలో ఎక్కువగా పోషకాలు ఉంటాయి. తక్కువ కేలరీలు ఉంటాయి. వీటిల్లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే జింక్, కాపర్, మాంగనీస్,ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు కూడా లభిస్తాయి. విటమిన్ సి, నియాసిన్, రిబోఫ్లేవిన్, థయామిన్ వంటి విటమిన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే బూడిద గుమ్మడికాయలలో ఆల్కలాయిడ్లు,టానిన్లు, గ్లైకోసైడ్లు, ఫినాల్స్, ఫ్లేవనాయిడ్లు వంటి ఫైటోకెమికల్స్ కూడా అధికంగా ఉంటాయి. అంతే కాదండోయ్ ఈ బూడిద గుమ్మడికాయలలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

బూడిద గుమ్మడికాయను తినడం వల్ల బరువుని ఈజీగా తగ్గించుకోవచ్చు. బూడిద గుమ్మడి కాయ జీర్ణక్రియకు కూడా బాగా సహాయపడుతుంది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. దీనిలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ బూడిద గుమ్మడికాయతో మలబద్దకం,అజీర్థ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అల్సర్లు, హైపర్ ఎసిడిటీ, డైస్పెప్సియా వంటి సమస్యలను తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. బూడిద గుమ్మడికాయలో పొటాషియం, సోడియం కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అయితే సోడియంతో పోలిస్తే పొటాషియమే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Exit mobile version