Site icon HashtagU Telugu

Lemon-Chia Seeds: ‎రోజు నిమ్మకాయ, చియా విత్తనాలు కలిపి తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Lemon Chia Seeds

Lemon Chia Seeds

‎Lemon-Chia Seeds: నిమ్మకాయ, చియా సీడ్స్ కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి ఎన్నో లాభాలను చేకూరుస్తాయి. ఈడ్రింక్ చాలా ఎఫెక్టీవ్ గా పని చేస్తుంది. అలాగే శరీరంలో ఎన్నో రకాల మార్పులను తీసుకువస్తుంది. ముఖ్యంగా ఈ డ్రింక్ కడుపుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో చాలా బాగా పని చేస్తుంది. ఇది గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకం వంటి కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుందట.

‎చియా విత్తనాలను నిమ్మకాయ నీటితో కలిపి తాగడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటాయట. ఇది గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుందని, గుండెపోటు, స్ట్రోక్ గుండె వైఫల్యం వంటి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. విటమిన్ సి, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలతో సమృద్ధిగా ఉన్న నిమ్మకాయ చియా పానీయం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందట. జలుబు, ఫ్లూ, జ్వరం, దగ్గు, అలెర్జీలు వంటి ఇన్ఫెక్షన్ల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.

‎యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే నిమ్మకాయ చియా సీడ్ డ్రింక్ శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుందని చెబుతున్నారు. రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా సహాయపడుతుందట. వేసవిలో నిమ్మకాయ చియా గింజల పానీయం తీసుకోవడం వల్ల కోల్పోయిన నీటిని తిరిగి నింపడంలో సహాయపడుతుందని, అలాగే హైడ్రేటెడ్‌గా ఉండటానికి ఇది ఒక మంచి డ్రింక్ అని చెబుతున్నారు. ఈ డ్రింక్ ని తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ డ్రింక్ ని తీసుకోవడానికి ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

Exit mobile version