Site icon HashtagU Telugu

Bobbarlu : బొబ్బర్లు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Health Benefits of Cow Peas Bobbarlu Alasandalu Know about it

Health Benefits of Cow Peas Bobbarlu Alasandalu Know about it

మనకు ఎప్పుడూ దొరికే అలసందల(Alasandalu) గింజలను బొబ్బర్లు(Cow Peas) అని కూడా అంటారు. ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచివి. బొబ్బర్లలో వివిధ రకాల విటమిన్లు, న్యూట్రీషన్లు, పోషకాలు ఉంటాయి. వీటిలో రెడ్, వైట్ బొబ్బర్లు(Red Cow Peas) దొరుకుతాయి. వీటిని కూర, పప్పు చేసుకొని తినొచ్చు, లేదా ఉడకబెట్టి, మొలకలు వచ్చినవి తినవచ్చు.

* బొబ్బర్లు తినడం వలన ఒబిసిటీ తగ్గుతుంది.
* బొబ్బర్లలో ఉండే అధిక పీచు మనం బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.
* బొబ్బర్లలో ఉండే లో గ్లిజమిక్ ఇండెక్స్ మధుమేహాన్ని తగ్గిస్తాయి.
* బొబ్బర్లు తినడం వలన మన శరీరంలో పోషకాహార లోపాన్ని తగ్గిస్తాయి.
* బొబ్బర్లు తినడం వలన అది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండె జబ్బులు రాకుండా తగ్గిస్తాయి.
* బొబ్బర్లలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
* బొబ్బర్లలో ఉండే అధిక ప్రోటీన్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
* బొబ్బర్లు గ్యాస్ వలన వచ్చే నొప్పిని కూడా తగ్గిస్తాయి.
* బొబ్బర్లు తినడం వలన అవి గర్భిణీ స్త్రీలకు పిండం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది.

వీటి వలన ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మన ఆహారంలో వీటిని భాగం చేసుకోవాలి . ఇవి అన్ని కాలాల్లోనూ బయట షాప్స్ లో ఈజీగా దొరుకుతాయి.

 

Also Read : Sweet Potato : చలికాలంలో చిలకడదుంప తినడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసా?

Exit mobile version