Site icon HashtagU Telugu

Clapping: చప్పట్లు కొట్టడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Clapping

Clapping

సాధారణంగా మనం ఎవరినైనా అభినందించడానికి కానీ, బర్త్డే విషెస్ చెప్పడానికి చప్పట్లు కొడుతూ ఉంటారు. పలు సందర్భాలలో ఆయా సందర్భాలను బట్టి చప్పట్లు కొడుతూ ఉంటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే చప్పట్లు కొట్టడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతే కాకుండా చప్పట్లు కొట్టడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. మరి చప్పట్లు కొట్టడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆరోగ్యంగా ఉండటం కోసం మీరు ప్రతిరోజు ఉదయాన్నే చప్పట్లు కొట్టాలి. ఉదయాన్నే చప్పట్లు కొట్టడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం బాగా ఉంది మిమ్మల్ని మరింత శక్తివంతంగా తయారు చేస్తుంది.

రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. అయితే మీరు ఎప్పుడైనా వజ్రాసనం లేదంటే సుఖాసనంలో కూర్చుని చప్పట్లు కొట్టాలి. ఈ విధంగా ప్రతిరోజూ చేయడం వల్ల అధిక బరువు సమస్యతో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది. అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఇతర రకాల శారీరక వ్యాయామాలు చేయలేరు. కాబట్టి చప్పట్లు కొట్టడం ద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే అధిక రక్తపోటు లేదా హైపో టెన్షన్స్ వంటి సమస్యల మంచి ఉపశమనం పొందవచ్చు. చప్పట్లు కొట్టినప్పుడు మానవ శరీరంలో ఉండే శక్తి కేంద్రాలు మరింత ఉత్తేజపరచడానికి సహాయపడతాయి. ప్రతిరోజు 10 నుంచి 15 నిమిషాల పాటు చప్పట్లు కొట్టడం వల్ల మరింత ఎనర్జిటిక్ గా ఉండవచ్చు.

అలాగే చప్పట్లు కొట్టడం వల్ల మనసు శరీరాన్ని బలోపేతం చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయాన్నే చప్పట్లు కొట్టడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్రమంగా అది మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉండేలా చేస్తుంది. అలాగే చప్పట్లు కొట్టేటప్పుడు చేతులలోని అన్ని బిందువులు తాకడం వల్ల అనేక రకాల వ్యాధులు తగ్గుతాయి. అంతే కాకుండా రక్తప్రసరణ కూడా సులభతరం అవుతుంది. చప్పట్లు కొట్టడం ద్వారా కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే మధుమేహం గుండె జబ్బులు, ఆస్తమా, ఆర్థరైటిస్ లాంటి వ్యాధుల నుంచి కూడా బయటపడవచ్చు.

Exit mobile version