చాలామంది కాకరకాయ చేదుగా ఉంటుంది అని తినడానికి ఇష్టపడరు. మరికొందరు మాత్రం కాకరకాయను ఇష్టపడి మరి తింటూ ఉంటారు. కాకరకాయను ఫ్రై చేసినా లేదంటే ఉడికించిన అలాగే జ్యూస్ రూపంలో తీసుకున్నా కూడా ఎన్నో రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. కాకరకాయ అంటే ఇష్టపడిన వారు కాకరకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే లొట్టలు వేసుకొని తింటారు. మరి కాకరకాయల వల్ల కలిగే ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కాకరకాయ రోగనిరోధక వ్యవస్థను పెంపొందించడమే కాకుండా బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. సాధారణంగా మన రక్తంలో యూరిక్ యాసిడ్ అనే ఒక వ్యర్థ పదార్థం ఉంటుంది. మనం తినే ఆహార పదార్థాల్లోని ప్యూరిన్ అనే రసాయనం విచ్ఛిన్నం అయి యూరిక్ యాసిడ్ తయారవుతుంది. ఈ ప్రక్రియను కిడ్నీలు సమర్థవంతంగా పనిచేసేలా చేస్తాయి. అలాగే శరీరంలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలను బయటకు మూత్రం రూపంలో పంపిస్తాయి.
శరీరంలోని యూరిక్ యాసిడ్ బయటకు వెళ్లకుండా బాడీలోనే ఉండడం వల్ల , అధిక బరువు, డయాబెటిస్, వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కీళ్ల నొప్పి, నడకలో ఇబ్బంది, వాపు , కీళ్ల పగుళ్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి సమయంలో కాకరకాయను ఆహారంగా తీసుకోవాలి. కాకరకాయ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. కాకరకాయలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం తోపాటు విటమిన్ సీ ఉంటుంది. కాకరకాయ వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి. అలాగె క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. బరువు కూడా కాకరకాయ బాగా సహాయపడుతుంది. అదేవిధంగా కాకరకాయ కాలేయం పనితీరును మెరుగుపర్చడంతో పాటు చర్మ సమస్యలు కూడా దూరం చేస్తుంది.