Site icon HashtagU Telugu

Dates Benefits: ఖర్జూరం తింటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే?

Health Benefits Are You Eating Dates.. But You Must Know These Things..

Health Benefits Are You Eating Dates.. But You Must Know These Things..

Know the Health Benefits of eating Dates Daily : ఖర్జూరం తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రతిరోజు వీటిని తీసుకోవడం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదట. వీటిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. నీరసంగా బలహీనంగా ఉండేవారు ఖర్జూరాలు (Dates) తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఐరన్ అందుతుంది. ప్రతిరోజు ఖర్జూరాలను తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా పొందవచ్చు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ ఖర్జూరాలను (Dates) తినవచ్చు. వీటిలో ఉండే పోషకాలు పిల్లలు ఎదుగుదలకి బాగా తోడ్పడతాయి. అయితే మరి ఖర్జూరాలు తినడం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

స్త్రీలలో రుతుక్రమం ఆగిపోవడం పురుషుల్లో అయితే టెస్టోస్ ఉత్పత్తి తగ్గిపోవడం అలాగే ఎముకల్లో కాల్షియం ఫాస్ఫరస్ తగ్గిపోవడం ఎముకలు గుల్లగా తయారవ్వడం వల్ల ఆ వయస్సుల వారికి తరచుగా కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఖర్జూరం తీసుకుంటే ఖర్జూరంలో ఉండే కాల్షియం ఫాస్ఫరస్ వల్ల నొప్పులు కీళ్ల నొప్పులు, నడుం నొప్పి మెడ నొప్పి మరే విధమైన కీళ్ళకు సంబంధించిన నొప్పులు అన్ని తగ్గిపోతాయి. చాలామందిలో కాళ్లు చేతులు తిమ్మిర్లు, కాళ్లు చేతులు వంకర్లు పోవడం ఇవన్నీ కూడా క్యాల్షియం లోపం వల్లే జరుగుతాయి. కాబట్టి తరచుగా ఖర్జూరం తీసుకుంటూ ఉంటే ఈ సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. నీటిలో నానబెట్టిన తర్వాతే ఖర్జూరం తినాలి.

అలా కూడా మీకు ఇబ్బంది అనుకుంటే ఎండు ఖర్జూరాన్ని పౌడర్లా చేసుకుని పాలలో వేసుకొని ప్రతి రోజు తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మంచి ఇమ్యూనిటీ పెరుగుతుంది. మీ బాడీలో అలాగే అన్ని అవయవారికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఖ‌ర్జూరాల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల వీటిని రోజూ తింటే జీర్ణ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ముఖ్యంగా మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. అయితే ఖ‌ర్జూరాల‌ను ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. ఉద‌యం ప‌ర‌గ‌డుపున ఖ‌ర్జూరాల‌ను తిన‌వ‌చ్చు. దీంతో ఉద‌యం శ‌రీరానికి వేగంగా శ‌క్తి ల‌భిస్తుంది. ఇది మ‌న‌ల్ని రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది. బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. రోజంతా ఉత్సాహంగా ప‌నిచేస్తారు. మెద‌డు యాక్టివ్‌గా ప‌నిచేస్తుంది. చురుగ్గా ఉంటారు.

Also Read:  Realme gt 5 pro: ఫీచర్స్ తో అదరగొడుతున్న రియల్‌మీ సరికొత్త స్మార్ట్ ఫోన్.. ధర వివరాలవే?