Site icon HashtagU Telugu

Parenting: మీ పిల్లల్లో ఈ మార్పులు కనిపించాయా? అయితే జాగ్రత్త పడండి..!!

Children

Children

పిల్లల మనస్సు కల్మ‌షం లేనిది. పిల్లలు దేవుడితో సమానం అంటుంటారు. కొంతమంది పిల్లలు అల్లరి చేస్తూ చలాకీగా ఉంటారు. మరికొందరు నలుగురిలో కలిసేందుకు ఇష్టపడరు. పిల్లల పెంపకం తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటుంది. మనం ఏం చేస్తే…మనల్ని అనుకరించేందుకు వారు ప్రయత్నిస్తుంటారు. అందుకే చిన్నారుల ముందు ఎలాంటి విషయాలను ప్రస్తావించకూడదంటున్నారు.

అయితే మ‌న‌లానే పిల్ల‌లు కూడా కొన్ని సమస్యలతో బాధపడుతుంటారు. తల్లిదండ్రులతో చెప్పుకోలేక లోలోపల మదనపడుతుంటారు. వారి రోజువారీ ప్రవర్తనలో వచ్చే మార్పుల వల్ల మనం వాటిని గమనించవచ్చు. అయ‌తే, కొంతమంది తల్లిదండ్రులను పిల్లల్లో మార్పులను విస్మరిస్తారు. దీంతో పిల్లలు ఒంటరిగా భావిస్తుంటారు.

మీ పిల్లలో ఇలాంటి మార్పులను గమనించినట్లయితే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆహారం పట్ల విరక్తి

పిల్లలు ఆహారం పట్ల ఆసక్తిచూపడటం లేదని గమనిస్తే…తనకు ఇష్టమైన ఆహారం కూడా తినడానికి ఇష్టపడటం లేదంటే ఏదో శారీరక లేదా మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నార‌ని అనుకోవాలి. ఆహారం పట్ల విరక్తి అనేది ఇదొక సంకేతం. కాబట్టి ఆలస్యం చేయకుండా వారి సమస్యలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.

పిల్లల ప్రవర్తనలో మార్పులు
ప్ర‌తీ ఇద్ద‌రు పిల్ల‌ల స్వభావం భిన్నంగా ఉంటుంది. కొంతమంది చిన్నారులు సిగ్గుపడతారు. కొంతమంది ఉల్లాసంగా ఉంటారు. కానీ మీ బిడ్డ ఒంటరిగా ఉన్నట్లు గమనిస్తే….దాన్ని ఎట్టిప‌రిస్ధితుల్లో విస్మరించకూడదు. ఒక‌వేళ అలా ఉంటే. పిల్లవాడు మనస్సులో ఏదా బాధపడుతున్నాడని అర్థం. కానీ తను మీకు చెప్పుకోలేక‌పోతూ ఉండి ఉండ‌వ‌చ్చు. అలాంటి సమాయాల్లో పిల్లలతో ప్రేమగా మాట్లాడటం చాలా ముఖ్యం.

అరుపులు
ఇది కూడా పిల్లల్లో కనిపించే ఒక మార్పు. మానసికంగా కలవరపడినప్పుడు పిల్ల‌లు చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటారు. ఎలాంటి కారణం లేకుండా అరుస్తుంటారు. కాబ‌ట్టి ఈ మార్పును గ‌మ‌నిస్తూ ఉండాలి.

అబ‌ద్ధాలు చెప్పడం
పిల్లలందరూ కొన్నిసార్లు అబద్ధాలు చెబుతారు. తమ తల్లిదండ్రులు తిడతారనో…వారితో విషయాలను చెప్పకూడదనో అలా చేస్తుంటారు. కానీ మీ బిడ్డ పదే పదే అబద్దాలు చెబుతుంటే…వారి ముఖంలో భయంతో కూడిన వ్యక్తీకరణ కనిపిస్తే…ఆ సమస్యను మీతో పంచుకోలేకపోతున్న‌ట్టు భావించాలి. ఇలాంటి పరిస్థితిలో మీరు ప్రేమగా మాట్లాడండి.