Breakfast Recipes : మిల్లేట్స్ దోశ ఎప్పుడైనా టేస్ట్ చేశారా..? షుగర్ పేషంట్లకు ఎంతో మేలు చేస్తుంది..!!

  • Written By:
  • Publish Date - November 27, 2022 / 09:11 AM IST

దోశ అంటే చాలామందికి ఇష్టం. అందులో రకరకాల దోశలు ఉంటాయి. సన్నగా…పొరలుగా…వేడివేడిగా ఉండే దోశలు తినేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే మామూలుగా బియ్యం, మినపపప్పుతో చేసే దోశనే కాకుండా…మిల్లెట్స్ తో కూడా దోశను ట్రై చేయవచ్చు. దానిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

మిల్లేట్ దోశ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది గ్లూటెన్ రహిత బ్రేక్ ఫాస్ట్ వంటకం. మిల్లెట్స్ వాడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండంతో…కొందరు వీటిని తినేందుకు ఇష్టపడుతున్నారు. మిల్లేట్స్ దోశ తింటే ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. రుచితోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. దీనిని సులభంగా తయారు చేసుకోవచ్చు. షుగర్ పేషంట్లకు చాలా మంచిది. ఈ మిల్లెట్స్ దోశను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

– మిల్లెట్స్ – 1 కప్పు

– బియ్యం – అరకప్పు

– మినపప్పు – అరకప్పు

-ఉప్పు – తగినంత

– నూనె – తగినంత

తయారీ విధానం.

మినపప్పును ముందుగా నానబెట్టాలి. బియ్యం, మిల్లెట్స్ ను మరో బౌల్లో నానపెట్టాలి. ఈ రెండింటిని నాలుగు గంటలపాటు నానపెట్టిన తర్వాత…గ్రైండ్ చేసుకోవాలి. ఈ రెండు బాగా మిక్స్ అయ్యాక…దోశకోసం పిండి ఎలా ఉంటుందో తెలుసు కదా. మరి పల్చగా కాకుండా మరి గట్టిగా కాకుండా చూసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు వెయ్యాలి. ఈ పిండిని రాత్రి పూట పులియపెట్టుకోవాలి. మరుసటిరోజు దోశ పేనమ్ పై కొంచెం నూనె వేయాలి. తర్వాత కొంచెం నీరు చిలకరించి…పిండితో దోశను వేయాలి. అంతే సింపుల్ వేడి వేడి దోశలు రెడీ. దీనిని పల్లి చట్నీ కానీ, టమోటా చట్నీ కానీ, కొబ్బరి చట్నీ తో కానీ తింటే ఉంటుంది చూడు టేస్ట్ సూపర్బ్. చిన్నపిల్లలు ఈ దోశలు తినడానికి ఎంతో ఇష్టపడతారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ సారి ట్రే చేయండి.