Site icon HashtagU Telugu

‎Lipstick: రంగు రంగుల లిప్‌స్టిక్స్ ని తెగ వాడేస్తున్నారా.. అయితే జాగ్రత్త క్యాన్సర్ కు హాయ్ చెప్పినట్టే!

Lipstick

Lipstick

Lipstick: ఇటీవల కాలంలో స్త్రీలలో లిప్‌స్టిక్‌ వాడే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. రకరకాల రంగురంగుల లిప్స్టిక్లు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. పైగా వీటిలో ఫ్లేవర్స్ కూడా వచ్చాయి. చిన్నపిల్లలు కూడా వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ లిప్‌స్టిక్‌ లను పెదవులు అందంగా ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఉపయోగిస్తారు అన్న విషయం తెలిసిందే. అయితే మార్కెట్‌ లో లభించే అనేక లిప్‌స్టిక్‌ లలో ఉండే కొన్ని రసాయన పదార్థాలు దీర్ఘకాలంలో ఆరోగ్యానికి ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వంటి సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

‎లిప్‌ స్టిక్‌ ను ఉపయోగించినప్పుడు అనుకోకుండా నోటి లోకి కూడా చేరుతుందట. ఇలా హానికర పదార్థాలు శరీరంలోకి చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంకా ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. లిప్‌ స్టిక్‌లలో రంగు కోసం లేదా తయారీ ప్రక్రియలో మలినాలుగా చేరే భార లోహాలు ముఖ్యమైన ఆరోగ్య సమస్యలను గుర్తిస్తాయట. వీటిలో కొన్ని ఊపిరితిత్తుల క్యాన్సర్‌ కు కారణమయ్యే కార్సినోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటాయట. లిప్‌ స్టిక్ ఉపయోగించడం ద్వారా ఈ లోహం శరీరంలోకి వెళ్లడం వల్ల ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతిని, కాలక్రమేణా ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరిస్తున్నారు.

‎క్రోమియం..ఇది కూడా మానవ క్యాన్సర్ కారకంగా చెబుతారు. దీనిని ఎక్కువ మోతాదులో దీర్ఘకాలం పాటు తీసుకుంటే ఇది శరీరంలోకి చేరితే, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. లిప్‌స్టిక్‌ లలో సీసం మలినాలను ఎక్కువగా గుర్తించినప్పుడు నిపుణులు చెబుతున్నారు. సీసం ప్రధానంగా నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుందట. అయినప్పటికీ ఇది దీర్ఘ కాలికంగా శరీరంలో పేరుకుపోయి ఇతర ఆరోగ్య సమస్యలతో పాటు పరోక్షంగా క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే భార లోహాలతో పాటుగా లిప్‌స్టిక్ ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి ఉపయోగించే కొన్ని రసాయనాలు కూడా హాని కలిగిస్తాయని చెబుతున్నారు. పారాబెన్స్.. వీటిని లిప్ స్టిక్స్ లో ప్రిజర్వేటివ్స్‌ గా ఉపయోగిస్తారు. పారాబెన్స్ హార్మోన్ల వ్యవస్థను ప్రభావితం చేస్తాయ. ఇవి ముఖ్యంగా ఈస్ట్రోజెన్‌ ను అనుకరించి, రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి లిప్‌ స్టిక్ వాడకాన్ని పూర్తిగా మానేయడం మంచిది. అలాగే ఏదైనా కొత్త లిప్‌ స్టిక్‌ ను వాడే ముందు చిన్న ప్రదేశంలో రాసి మీ చర్మానికి పడుతుందో లేదో పరీక్షించుకోవాలని చెబుతున్నారు. ప్రతిరోజూ, ప్రతిపూట లిప్‌ స్టిక్‌ను వాడకుండా వీలైనంత వరకు తగ్గించాలని తిన్న తర్వాత లిప్‌ స్టిక్‌ ను తీసివేయాలి అని చెబుతున్నారు.

Exit mobile version