Sanitizer: శానిటైజర్ వాడుతున్నారా.. ఈ జాగ్రత్తలు మరవకండి!

కోవిడ్...ప్రజల అలవాట్లను పూర్తిగా మార్చేసింది.

  • Written By:
  • Updated On - January 28, 2022 / 04:59 PM IST

కోవిడ్…ప్రజల అలవాట్లను పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రత అనేది బాగా పెరిగింది. కోవిడ్ బారిన పడకుండా ఉండేందుకు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులోనూ కోవిడ్ నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, వ్యక్తిగత శుభ్రత అనేది తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు.
అయితే మాస్కులు ధరించడం, తరచుగా చేతులను క్లీన్ చేసుకోవడం…ఇవన్నీ కూడా మన జీవితంలో కొత్తగా వచ్చి చేరాయి. ఇవి మనం తప్పకుండా పాటించాల్సిన రూల్స్ లా మారిపోయాయి. ఎందుకంటే ఇవే మనల్ని వైరస్ బారినపడకుండా చేసే బ్రహ్మస్త్రాలు. అయితే చేతులను శుభ్రపరచడానికి శానిటైజర్లనే ఎక్కువ ఉపయోగించేందుకు మక్కువ చూపిస్తున్నారు జనాలు. అందుకే ప్రస్తుతం శానిటైజర్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. వీటిని వాడటం వల్ల చేతులపై ఉండే బ్యాక్టీరియా, క్రిములు, వైరస్ లు నశిస్తాయి. అందుకే ఈ శానిటైజర్లను జనాలు విపరీతంగా వాడుతున్నారు.

ఇక శానిటైజర్ల వాడకం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో…నష్టాలు కూడా అన్నే ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే వీటి వాడకంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
1. మనం వాడే శానిటైజర్లలో 60నుంచి 90శాతం ఆల్కహాల్ తో తయారవుతుంది. దీన్ని వాడినప్పుడు స్టవ్ దగ్గరకు వెళ్లకూడదు. ఎందుకంటే చేతులకు మంట అంటుకునే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఆల్కహాల్ కు మండే స్వభావం ఉంటుంది. అందుకే శానిటైజర్లను చేతులకు పెట్టుకున్నప్పుడు వెంటనే కాకుండా పూర్తిగా చేతులకు ఇంకిపోయిన తర్వాత వంట పని ప్రారంభించాలి.
2. శానిటైజర్ ను అతిగా వాడితే చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే దీని వాడకం తగ్గించాలి. శానిటైజర్లకు కేవలం బ్యాక్టీరియాలను , క్రిములను వైరస్ లను అంతం చేస్తుందన్న విషయం గుర్తుంచుకుని వీటిని వాడాలి.
3. చేతులు జిడ్డుగా అయ్యాయాని..మురికిగా ఉన్నాయని శానిటైజర్లు వాడకూడదు. ఆ సమయంలో కూడా శానిటైజర్లను వాడితే చేతులకు పేరుకుపోయే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చిన్నపిల్లలకు శానిటైజర్ దూరంగా ఉండేలా చూడాలి. ఒక వేళ వాళ్లు కూడా చిన్న పిల్లలు కూడా వాడిని చేతి వేళ్లను నోట్లో పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
4. శానిటైజర్స్ వాడితే చేతులకు అంటుకున్న క్రిములు చావడం ఎంత నిజమో…దీన్ని వాడితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయన్న మాట కూడా అంతే నిజమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ శానిటైజర్లు మన శరీరానికి మంచి చేసే బ్యాక్టీరియాను కొన్నిసార్లు చంపేస్తుంది.
5.మరొక ముఖ్యమైన విషయం..శానిటైజర్ తరచుగా ఉపయోగిస్తే…శానిటైజర్లకు కూడా చనిపోని బ్యాక్టీరియా తయారయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు…వీటిని ఎక్కువవాడితేకొన్ని రోజులకు చర్మం పొడిబారిపోతుందట. ఈ సమస్య నుంచి బయటపడాలంటే…మళ్లీ మాయిశ్చరైజర్లను వాడాల్సి ఉంటుంది. అందుకే ఈ సమస్య రాకుండా ముందునుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉండాలంటే శానిటైజర్లకు బదులుగా సబ్బులను వాడటం అలవాటు చేసుకోవడం మంచిదని అరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.