Site icon HashtagU Telugu

Hair Tips: రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క పని చేస్తే చాలు.. జుట్టు వేగంగా పెరగడం ఖాయం?

Mixcollage 17 Dec 2023 04 13 Pm 3693

Mixcollage 17 Dec 2023 04 13 Pm 3693

ప్రస్తుత రోజుల్లో స్త్రీ పురుషులు చాలామంది అనేక రకాల కారణాల వల్ల జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. చుండ్రు సమస్య, హెయిర్ ఫాల్, జుట్టు చిట్లిపోవడం, జుట్టు తెల్లబడటం లాంటి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. అయితే పురుషుల సంగతి పక్కన పెడితే ప్రతి ఒక్క స్త్రీ కూడా అందమైన పొడవాటి జుట్టును కోరుకుంటుంది. అయితే జుట్టు పెరగడం కోసం చాలామంది అనేక రకాల ప్రోడక్ట్లను ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకొందరు వంటింటి చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఎన్ని చేసినా కూడా జుట్టు పెరగడం లేదా. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ ఒక్క పని చేస్తే చాలు జుట్టు పెరగడం ఖాయం అంటున్నారు నిపుణులు..

మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మాకు తెలుసుకుందాం.. ఇందుకోసం ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని దాని పైన పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి దాన్ని మెత్తగా తురుముకోవాలి. లేదంటే మిక్సీ లో వేసి మెత్తని పేస్టులా చేయాలి. దాని తర్వాత మూడించల అల్లం ముక్కలను తీసుకుని శుభ్రంగా కడిగి దానిని కూడా తురుముకోవాలి. లేదా దానిని కూడా మెత్తని పేస్టులా మిక్సీ జార్ లో వేసి చేసుకోవచ్చు. ఇక ఈ రెండిటిని ఒక క్లాత్ సహాయంతో వడకట్టుకోవాలి. తర్వాత దీనిలో ఒక చెంచా బ్లాక్ క్యాస్ట్రాయిల్ తీసుకోవాలి. బ్లాక్ కాస్ట్ ఆయిల్ లేదంటే మామూలు ఆముదం ఒక చెంచా తీసుకోవాలి.

లేదంటే విటమిన్ ఈ క్యాప్సిల్స్ లేదా ఒక చెంచా బాదం నూనె అయినా సరే కలుపుకోవచ్చు. వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకుని జుట్టు మొత్తానికి కాకుండా కేవలం మాడుకి మాత్రమే అప్లై చేస్తే సరిపోతుంది. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక 60 నిమిషాల పాటు అలా వదిలేయాలి. తర్వాత ఏదైనా గాడత తక్కువ ఉన్న షాంపుతో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన అల్లం,ఉల్లిపాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్స్ లాంటి ఇబ్బందులను తగ్గిస్తుంది. వీటిలో ఉండే మెగ్నీషియం, సల్ఫర్, కాపర్, ఐరన్, మాంగనీస్ లాంటి ఖనిజాలు జుట్టు రాలడాన్ని ఆపి జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. అలాగే తెల్ల జుట్టుని నల్లగా మారుస్తుంది. అదే విధంగా బాల్ హెడ్ జుట్టు పల్చగా ఉండి ఇబ్బంది పడుతున్న వారికి ఇది బాగా సహాయపడుతుంది.