Site icon HashtagU Telugu

Hair Tips: రాత్రి సమయంలో నూనెలో ఈ ఒకటి కలిపి రాస్తే చాలు.. మీ జుట్టు గడ్డిలా పెరగాల్సిందే?

Mixcollage 26 Feb 2024 02 58 Pm 4002

Mixcollage 26 Feb 2024 02 58 Pm 4002

మాములుగా అమ్మాయిలు పొడవాటి జుట్టు కావాలని కొరుకుంటూ ఉంటారు. అందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఎటువంటి ఖర్చు లేకుండా మీ జుట్టును పెంచుకోవాలని అనుకుంటున్నారా. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే చిట్కాలు ట్రై చేయాల్సిందే. ఆ చిట్కా ట్రై చేస్తే మీకు ఇప్పటివరకు ఊడిన జుట్టు మొత్తం మళ్లీ తిరిగి మొలవడం ఖాయం. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. ముందుగా మూడు తమలపాకులు తీసుకోవాలి. జుట్టుకు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయడానికి తమలపాకులు లేదా పాన్ ఆకులను ఆయుర్వేదంలో వాడుతారు.

ఈ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తుంది. ఇప్పుడు మీరు మూడు తమలపాకులను తీసుకున్నారు కదా వాటిని శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్ లో ఉంచుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకును తీసుకొని ఈ ప్లేట్లో వేయాలి. కరివేపాకు కొలెస్ట్రాన్ని తగ్గించడానికి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి చక్కగా పనిచేస్తుంది. అలాగే ఒక ఏడు లేదా ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలను పోట్టు ఒలిచేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ప్లేట్ లో వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ మెంతులు తీసుకోవాలి. స్టవ్ పై ఒక స్టీల్ గిన్నెను పెట్టి దానిలో ప్యూర్ కొబ్బరినూనె ఒక పావు లీటరు పోసుకోవాలి. దానిలో ముందుగా మెంతులు వేసుకోవాలి.

తర్వాత మనం తీసుకున్న ఇంగ్రిడియంట్స్ ఒక్కొక్కటి తమలపాకులు వెల్లుల్లి, అలాగే కరివేపాకు కూడా వేసేయండి. ఇవి బాగా మాడిపోకూడదు. నలుపు రంగు రానివ్వకండి. గోల్డ్ కలర్ లోకి వస్తుంది. ఆ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించుకోవచ్చు. ఇలా బాగా చల్లారిన తర్వాత స్ట్రైనర్ సహాయంతో ఒక గాజు సీసాలోకి వడగట్టుకుని స్టోర్ చేసుకోండి. ఈ ఆయిల్ ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. రోజు కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా ఈ ఆయిల్ ని వాడినట్లయితే మీ జుట్టు వద్దన్నా భయంకరంగా పెరుగుతుంది. అయితే ఈ ఆయిల్ ని రాత్రి సమయంలో పడుకునే ముందు అప్లై చేస్తే మరిన్ని మంచి ఫలితాలు కనిపిస్తాయి.