Hair Tips: ఈ సింపుల్ చిట్కాలు ఉపయోగిస్తే చాలు.. మీ జుట్టు నల్లగా నిగనిగలాడడం ఖాయం?

ఈ రోజుల్లో చాలామంది జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. హెయిర్ ఫాల్, జుట్టు చిట్లిపోవడం, చుండ్రు, పొట్టి జుట్టు

  • Written By:
  • Publish Date - January 2, 2024 / 03:30 PM IST

ఈ రోజుల్లో చాలామంది జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. హెయిర్ ఫాల్, జుట్టు చిట్లిపోవడం, చుండ్రు, పొట్టి జుట్టు, పలుచని జుట్టు ఇలా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. మామూలుగా ప్రతి ఒక్కరు కూడా నల్లటి పొడవాటి నిగినిగి లాడే జుట్టు కావాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో అనేక కారణాలవల్ల చాలామందికి అది సాధ్యం కాదు. పొడవాటి జుట్టు కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు సరైన ఫలితాలు రాలేదని దిగులు చెందుతూ ఉంటారు.

మీరు కూడా పొడవాటి ఒత్తైన జుట్టుని కోరుకుంటున్నారా. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే.. మనం ప్రతిరోజు అన్నం తిన్న తర్వాత కొద్దిగా మిగిలిపోతే ఆ అన్నాన్ని పడేస్తూ ఉంటాం. కానీ అన్నంతో జుట్టు సమస్యలను సులువుగా తగ్గించుకోవచ్చు. జుట్టు నల్లగా, పొడవుగా పెరగడానికి అన్నం ఎంతో సహాయపడుతుంది. అన్నంలో ఉండే జిగురుతో మన జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు. అన్నంతో జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు. వివిధ రకాల రసాయనాలతో తయారైన హెయిర్ ఆయిల్స్ ను వాడే బదులు మనకు రోజు ఇంట్లో దొరికే అన్నంతో సులువుగా జుట్టును ఒత్తుగా, పొడవుగా చేసుకోవచ్చు.

ఈ అన్నంతో మనకు ఆరోగ్యపరంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగవు. అలాగే ఈ అన్నంతో సులువుగా జుట్టుకోసం చిట్కాను తయారు చేసుకోవచ్చు. కనుక ఎప్పుడైనా సరే మీ ఇంట్లో మిగిలిన అన్నం పడేయకండి. ముందుగా మన ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని తీసుకొని దానిని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న అన్నం మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అందులోకి ఒక స్పూన్ ఆముదం వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని తల మాడ నుంచి కురులు చివర్ల దాకా బాగా పట్టించాలి. ఒక అరగంటసేపు ఆరనివ్వాలి. తర్వాత కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే మీకు జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా జుట్టు పొడవుగా, నల్లగా నిగనిగలాడే జుట్టు మీ సొంతం అవుతుంది. చాలా తక్కువ ఖర్చుతో జుట్టూ సమస్యల నుంచి సులువుగా బయటపడవచ్చు.