Hair Tips: వారానికి ఒక్కసారి ఇలా చేస్తే చాలు చుండ్రు సమస్య మళ్ళీ రమ్మన్నా రాదు!

ఈ రోజుల్లో చాలామంది చుండ్రు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ చుండ్రు సమస్య కారణంగా చాలామంది తెగ ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ

Published By: HashtagU Telugu Desk
Mixcollage 23 Feb 2024 09 48 Pm 6207

Mixcollage 23 Feb 2024 09 48 Pm 6207

ఈ రోజుల్లో చాలామంది చుండ్రు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ చుండ్రు సమస్య కారణంగా చాలామంది తెగ ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ చుండ్రు సమస్యను తగ్గించుకోవడానికి చాలా మంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. హోమ్ రెమిడీలను ఫాలో అవ్వడంతో పాటు రకరకాల బ్యూటీ ప్రోడక్ట్లను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దీనికోసం మనకు కావాల్సింది ఒక 2 స్పూన్ లు మెంతులు. వీటిని తీసుకొని గిన్నెలో వేయాలి.

వేసి చక్కగా దాన్ని రోస్ట్ చేసుకోవాలి. ఇక రెండోది వచ్చేసి అప్పటికి మీరు తీసుకోవాల్సింది ఒక గుప్పెడు కరివేపాకు. సో వీటిని కూడా దాంట్లో వేసేసి శుభ్రంగా వాటిని లైట్ గా మీరు రోస్ట్ అనేది చేసుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి రోస్ట్ చేసుకోవాలి. ఇక తర్వాత స్టవ్ ఆపుకొని కొంచెం ఆరిన తర్వాత మీరు దాన్ని తీసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత దాన్ని గాజు బాటిల్ వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఉదయం నిద్ర లేచినప్పుడు ఒక హాఫ్ ఆఫ్ స్పూన్ ఈ మిశ్రమం తీసుకొని మీరు గొంతులో వేసేసుకొని మింగేసి కాస్త ఒక పెద్ద గ్లాస్ వాటర్ అనేది తాగాలి. దీనిని ప్రెగ్నెంట్ లేడీస్ వేసుకోకూడదు. దీనిని రెగ్యులర్గా ఈ విధంగా వాడినట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది.

ఇప్పుడు మేము చెప్పిన రెమెడీని వారానికి ఒకసారి మాత్రమే ఉపయోగించాలి అది కూడా స్నానానికి 30 నిమిషాల ముందు ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఇలా తరచుగా చేస్తూ ఉండడం వల్ల చుండ్రు సమస్య మళ్ళీ రమ్మన్నా రాదు. మెంతులు కరివేపాకు జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో ఎంతో ఎఫెక్టీవ్ గా పని చేస్తాయి.

  Last Updated: 23 Feb 2024, 09:49 PM IST