Site icon HashtagU Telugu

Hair Tips: ఉల్లిపాయతో ఈ విధంగా చేస్తే చాలు మీ జుట్టు ఒత్తుగా పెరగడం ఖాయం?

Mixcollage 01 Jan 2024 03 09 Pm 388

Mixcollage 01 Jan 2024 03 09 Pm 388

మామూలుగా అమ్మాయిలు ప్రతి ఒక్కరూ కూడా ఒత్తైన నల్లటి పొడవాటి జుట్టును కోరుకుంటూ ఉంటారు. అందుకోసం ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. బ్యూటీ పార్లర్ ల చుట్టూ తిరిగితే మరికొందరు హెయిర్ కేర్, వి కేర్ అంటూ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా జుట్టు సరిగ్గా పెరగడం లేదని హెయిర్ ఫాల్ అవుతోందని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని దిగులు చెందుతూ ఉంటారు. అయితే హెయిర్ ఫాల్ సమస్య తగ్గి జుట్టు బాగా పెరగాలి అంటే ఎటువంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జుట్టుకు సంబంధించిన సమస్యలకు ఉల్లిపాయ ఎంతో బాగా పనిచేస్తుంది.

ఉల్లిపాయను జుట్టుకు ఉపయోగించడం వల్ల ఒత్తుగా నల్లగా పెరుగుతుంది. అలాగే జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా ఉండవు. జుట్టు ఎంత పలుచగా ఉన్నా సరే రెమిడిని పాటిస్తే చాలు ఒత్తుగా పెరుగుతుంది. మరి ఉల్లిపాయతో ఏం చేస్తే జుట్టు బాగా పెరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముందుగా మనకు కావాల్సింది ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు మన జుట్టు పెరగడానికి బాగా సహాయపడుతుంది. అలాగే చుండ్రు సమస్యలను కూడా తగ్గిస్తుంది. మన జుట్టులో కెరోటిన్ లోపం ఉండడం వలన ఈ సమస్యలు అనేవి వస్తాయి. అయితే ఈ ఉల్లిపాయలో కెరోటిన్ అనేది సమృద్ధిగా ఉంటుంది. అయితే ఇప్పుడు మన జుట్టుకు సరిపడా ఉల్లిపాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి.

తర్వాత అందులో నాలుగు రెబ్బల కరివేపాకులను వేయాలి. ఈ కరివేపాకు జుట్టు కుదురులను బలంగా ఉంచి, జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. తర్వాత ఇందులోకి కలోంజి బ్లాక్ సీడ్స్ ఆయిల్ ను ఒక స్పూన్ వేసుకోవాలి. ఇది జుట్టు త్వరగా పెరగడానికి సహాయపడుతుంది. తరువాత టి ట్రీ ఆయిల్ ను మూడు లేదా నాలుగు చుక్కలు వేసుకోవాలి. ఇది తలలో వచ్చే దురద వంటి సమస్యలను తొలగిస్తుంది. తర్వాత అందులోకి రెండు స్పూన్ల కలబంద గుజ్జును వేసుకోవాలి. ఈ అలోవెరా జెల్ జుట్టు పెరగడానికి చుండ్రు నుంచి విముక్తి పొందడానికి బాగా సహాయపడుతుంది. ఇలా వేసుకున్న మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత జుట్టుకు ఆయిల్ రాయకుండా ఈ పేస్టును రాసుకోవాలి. ఈ పేస్ట్ ను జుట్టు చిగుర్ల నుంచి కుదుర్ల దాకా మొత్తానికి అప్లై చేయాలి. ఒక అరగంట సేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత మీ రోజు వారి షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు ఈ మిశ్రమాన్ని ఉపయోగించడం ద్వారా జుట్టు ఒత్తుగా గడ్డి లాగా పెరుగుతుంది. అలాగే చుండ్రు సమస్యలు కూడా తొలగిపోతాయి.