Site icon HashtagU Telugu

Hair Tips: పాతకాలం నాటి చిట్కాలతో చుండ్రు సమస్యలకు చెక్ పెట్టండిలా?

Mixcollage 04 Jan 2024 03 07 Pm 862

Mixcollage 04 Jan 2024 03 07 Pm 862

ప్రస్తుత రోజుల్లో చాలా మంది జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అందులో ముఖ్యంగా చుండ్రు సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలా చుండ్రు సమస్య అన్నది జుట్టు సమస్యల్లో ప్రధాన సమస్యగా మారిపోయింది. చాలామందికి ఈ సమస్య మరింత ఎక్కువ అయ్యి నలుగురిలోకి వెళ్లాలి అన్న కూడా ఇబ్బందిగా ఉంటుంది. తల నుంచి చుండ్రు రాలుతూ ఉండడం వల్ల నలుగురిలోకి వెళ్లాలి అన్న కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ చుండ్రు సమస్యను తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ అందులో కొన్ని ఫలించవు.

అయితే మీరు కూడా చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే. ఈ సమస్యను పాత కాలం నాటి పద్ధతులను ఉపయోగించి ఎలా చెక్ పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన జుట్టులో చుండ్రు సమస్య వేధిస్తుంటే మనకు విరివిగా లభించే గోరింటాకు సహాయంతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. వేడి నీటిలో గుప్పెడు గోరింటాకు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత గోరింటాకు తీసుకుని మిక్సీలో వేసి ఒక స్పూన్ ఆవనూనె, రెండు స్పూన్ల పెరుగుతో బాగా పట్టాలి. ఇలా ఆ మిశ్రమాన్ని బాగా మిక్సీ చేసిన తర్వాత ఈ మిశ్రమానికి గోరింటాకును మరిగించిన నీటిని కలపాలి.

అంతే కాకుండా ఈ మిశ్రమంలో రెండు స్పూన్ల ఉసిరి పొడి అది లేకపోతే రెండు స్పూన్ల బృంగ్రాజ్ లేదా మందార పొడి కలపాలి. వీటిని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని తీసుకుని జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకు బాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 40 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఆ రోజు జుట్టుకు షాంపూ కానీ కండీషనర్ కానీ అప్లై చేయకూడదు. మీకు కావాలంటే నెక్ట్స్ డే అప్లై చేసుకోవచ్చు. ఇలా నెలకు ఒకసారి కానీ రెండు సార్లు కానీ ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేస్తే మీకు చుండ్రు సమస్య నుంచి, పగలడం సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.