Site icon HashtagU Telugu

Hair Tips: హెయిర్ ఫాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే జుట్టుకు ఇది రాయాల్సిందే?

Mixcollage 26 Dec 2023 04 30 Pm 4230

Mixcollage 26 Dec 2023 04 30 Pm 4230

ప్రస్తుత రోజుల్లో హెయిర్ ఫాల్ సమస్య అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. ఈ హెయిర్ ఫాల్ సమస్య కారణంగా చాలామంది పురుషులు బట్టతల సమస్యతో బాధపడుతుండగా స్త్రీలు పొట్టి జుట్టు పలుచని జుట్టుతో బాధపడుతున్నారు. ఇక హెయిర్ ఫాల్ సమస్యను అరికట్టడానికి మార్కెట్లో దొరికే ఎన్నో రకాల ఆయిల్స్ ని ఉపయోగిస్తుంటారు. వాటి వల్ల కొన్ని కొన్ని సార్లు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకు అందుబాటులో ఉండే వాటితోనే ఈ హెయిర్ ఫాల్ సమస్యను తగ్గించుకోవచ్చు. మరి జుట్టు రాలడం తగ్గించడం కోసం ఎటువంటి చిట్కాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి ముందుగా జుట్టుకు సరిపడా బియ్యాన్ని తీసుకోవాలి. ఈ బియ్యాన్ని రెండుసార్లు కడిగిన తర్వాత ఎసరు పెట్టిన నీటిని ఒక పొంగు వచ్చిన తర్వాత తీసుకొని ఒక సీసాలోకి పోసి రాత్రి మొత్తం పులియ పెట్టుకోవాలి. పులియబెట్టిన బియ్యపు నీళ్లలో ఒక గిన్నెలోకి తీసుకొని ఒక కప్పు నీళ్లకు ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకోవాలి. కొబ్బరి నూనె వద్దనుకున్న వాళ్ళు బాదం నూనె కూడా వేసుకోవచ్చు. దీన్ని ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకునేవారు అయితే నూనె వేసుకోకపోయినా పర్వాలేదు. వాటిని కలిపిన తర్వాత ఈ నీటిని ఏదైనా స్ప్రే బాటిల్లో వేసుకొని తలస్నానం చేయడానికి ముందు రాసుకోవాలి. జుట్టు కుదర్ల నుంచి చివర్ల దాకా అప్లై చేసుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

మసాజ్ చేయడం వలన బ్లడ్ సర్కులేషన్ బాగా జరిగి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అప్లై చేసిన తర్వాత ఒక గంట పాటు ఉండి తర్వాత ఏదైనా షాంపుతో తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తర్వాత నేచురల్ ఎయిర్ కండిషన్ అప్లై చేసుకోవాలి. దీనికోసం మనం కలబంద మట్టను తీసుకొని శుభ్రంగా కడిగి అంచులను తీసేసి మధ్యలో ఉన్న జిగురును మిక్సీ జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్ట్రైనర్ సహాయంతో వడగట్టుకుని మెత్తగా ఉండే పదార్థాన్ని తీసుకోవాలి. దీనిలో విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసి బాగా కలుపుకోవాలి. తలస్నానం తర్వాత జుట్టు కుదురుల నుంచి చివర్ల దాకా అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఎటువంటి హెయిర్ డ్రయర్ ఉపయోగించకూడదు. ఇలా చేయడం వలన జుట్టు చాలా సున్నితంగా సిల్కీగా తయారు అవుతుంది.